Webdunia - Bharat's app for daily news and videos

Install App

హఫీజ్ సయ్యీద్‌కు షాక్: పాకిస్థాన్‌ ఏం చేసిందో తెలుసా?

ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయ్యీద్‌కు పాకిస్థాన్‌ చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతోంది. అంతర్జాతీయంగా హఫీజ్‌ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. అతనికి షాకివ్వాలని పాకిస్థాన్ రంగ

Webdunia
మంగళవారం, 2 జనవరి 2018 (09:07 IST)
ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయ్యీద్‌కు పాకిస్థాన్‌ చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతోంది. అంతర్జాతీయంగా హఫీజ్‌ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. అతనికి షాకివ్వాలని పాకిస్థాన్ రంగం సిద్ధం చేస్తోంది. 
 
ఇప్పటికే హఫీజ్ రాజకీయ పార్టీ పెట్టాడు. లాహోర్‌లో పార్టీ కార్యాలయం కూడా ప్రారంభించాడు. ఉగ్రవాది పాకిస్థాన్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఇంకా ప్రపంచ దేశాలు కూడా పాకిస్థాన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. 
 
ఇలాంటి పరిస్థితుల్లో హఫీజ్ ఆధ్వర్యంలో నడుస్తున్న చారిటీలు విరాళాలు సేకరించకుండా నిషేధం విధించింది. ఈ మేరకు సెక్యూరిటీస్ అండర్ ఎక్స్ఛేంజి  కమిషన్ ఆఫ్ పాకిస్థాన్ (ఎస్ఈసీపీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఉగ్రవాది ఆధ్వర్యంలో నడుస్తున్న జమాత్-ఉద్-దవా(జేయూడీ), లష్కరే తాయిబా (ఎల్‌ఈటీ), ఫలాహ్-ఇ-ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్)‌లకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అలాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల జాబితాలో ఉన్న జేయూడీ, లష్కరే తాయిబాతోపాటు మరో రెండు సంస్థలపై నిషేధం విధించింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments