Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు పాకిస్థాన్ సంఘీభావం.. కరోనా మంచి పని చేసిందిగా..?!

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (21:42 IST)
కోవిడ్‌పై భారత్ చేస్తున్న పోరాటానికి పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంఘీభావం తెలిపారు. కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.. అన్ని దేశాల్లో కాస్త తగ్గుముఖం పట్టినా.. భారత్‌లో కోవిడ్ విలయమే సృష్టిస్తోంది.. ఈ తరుణంలో మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడదాం అంటూ.. భారత్‌కు పిలుపునిచ్చారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.
 
పొరుగు దేశాలు, ప్రపంచంలో ఈ వ్యాధి బారిన పడినవారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ సోషల్ మీడియాలో వేదికగా పేర్కొన్నారు ఇమ్రాన్. ఆయన ట్వీట్‌ను పరిశీలిస్తే.. భారత్ కోవిడ్-19 ప్రభంజనంతో యుద్ధం చేస్తోంది.
 
భారత్‌కు సంఘీభావం ప్రకటిస్తున్నాను.. పొరుగు దేశాలు, ప్రపంచంలో ఈ మహమ్మారి బాధితులంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.. మానవాళి ఎదుర్కొంటున్న ఈ అంతర్జాతీయ సవాల్‌పై మనమంతా కలిసికట్టుగా పోరాడుదాం అంటూ పిలుపునిచ్చారు. ఎప్పుడూ పొరుగు దేశంపై కారాలు మిరియాలు నూరే పాకిస్థాన్ కరోనా విషయంలో మాత్రం సంఘీభావం తెలపడంపై భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది. 

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments