కుల‌్ భూషణ్‌ను కలవనున్న భారత దౌత్యాధికారులు

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (18:36 IST)
గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ చెరసాలలో మగ్గుతున్న నేవీ రిటైర్డ్ అధికారి కుల్ భూషణ్ జాదవ్‌ను కలుసుకునేందుకు భారత కాన్సులేట్ (దౌత్యాధికారులు) అధికారులకు పాకిస్థాన్ సర్కారు అనుమతి ఇచ్చింది. ఇటీవల అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పు దరిమిలా పాకిస్థాన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
తమ భూభాగంలో గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ కుల్ భూషణ్‌ జాదవ్‌ను పాకిస్థాన్ సైనికులు గత 2017లో అదుపులోకి తీసుకున్నాయి. ఆ తర్వాత వివిధ రకాలుగా విచారణ అనంతరం ఆయనకు పాకిస్థాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించింది. అయితే, ఈ వ్యవహారాన్ని భారత్ అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లగా, ఇటీవలే విచారణ జరిపిన న్యాయస్థానం కుల్ భూషణ్‌కు విధించిన మరణశిక్షను మరోసారి సమీక్షించాలంటూ పాక్‌ను ఆదేశించింది.
 
అంతేకాకుండా, జైల్లో మగ్గుతున్న కుల్‌భూషణ్‌ను కలుసుకునేందుకు ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులను అనుమతించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో కుల్ భూషణ్‌ను కలిసేందుకు భారత్‌కు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం పాక్ జైల్లో ఉన్న కుల్ భూషణ్‌ను భారత దౌత్యాధికారులు కలవనున్నారు. ఈ సందర్భంగా కుల్ భూషణ్‌కు న్యాయసహాయం అందించే అంశాలపై అధికారులు మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments