Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో యుద్ధాన్ని భరించలేం... భారత్‌తో శాంతి కావాలి: పాకిస్థాన్

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (15:56 IST)
భారత్‌తో మరో యుద్ధాన్ని కోరుకోవడం లేదని, ఆ దేశంతో శాశ్వత శాంతిని కోరుకుంటున్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని షెబాజ్ షరీఫ్ అన్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయ బృందంతో జరిగిన ఇష్టాగోష్టి సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ఐక్యరాజ్య సమితి తీర్మానాలు, కాశ్మీరీల అభిమతానికి అనుగుణంగా జమ్మూకాశ్మీర్ సమస్యను పరిష్కరించుకున్నపుడే దక్షిణాసియాలో సుస్థిర శాంతి సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. 
 
"భారత్‌తో శాశ్వత శాంతిని కోరుకుంటున్నాం. అది కూడా చర్చల ద్వారానే. యుద్ధం ఇరు పక్షాలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. పైగా, మేం మరో యుద్ధాన్ని భరించలేం. అందుకే పొరుగుదేశమైన భారత్‌తో శాశ్వత శాంతిని కోరుకుంటున్నట్టు షెబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, తమ దేశం దురాక్రమణ దేశంకాదన్నారు. అయితే, తమ వద్ద ఉన్న అణ్వాయుధాలు, ఇతర సైనిక సంపత్తి అనేది విపత్కర పరిస్థితుల్లో తమ దేశాన్ని రక్షించుకునేందుకు మాత్రమేనని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
 
ప్రపంచం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, అన్ని రంగాల్లో ప్రతి దేశం దూసుకుపోతుందన్నారు. ఇలాంటి సమయంలో ఇండోపాక్ దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థికం, ప్రజల జీవన ప్రమాణాల మెరుగు వంటి అంశాలపై పోటీతత్వం పెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments