Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో దారుణం... 23 మందిని కాల్చి చంపిన బీఎల్ఏ ఉగ్రవాదులు

ఠాగూర్
సోమవారం, 26 ఆగస్టు 2024 (13:15 IST)
పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ఆ దేశంలోని బలూచిస్థాన్ ప్రావిన్సులోని ముసాఖైల్ జిల్లా ఈ దారుణం వెలుగు చూసింది. పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రం నుంచి వస్తున్న వాహనాల్లోని వారిని కిందకు దించి ఉగ్రవాదాలు కాల్చి చంపారు. మొత్తం 23 మందిని హత్య చేశారు. మరో పది వాహనాలకు నిప్పు అంటించారు. 
 
బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులు, ట్రక్కులు, వ్యాన్లను ఆపిన ఉగ్రవాదులు అందులోని ప్రయాణికులను తనిఖీ చేసి తమ జాతి కాని వారిని కాల్చి చంపేశారు. పంజాప్ నుంచి వస్తున్న వాహనాలను ఆపి ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఏకంగా పది వాహనాలకు నిప్పు పెట్టారు. 
 
ఈ దారుణం ఘటన వెనుక బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఈ గ్రూపు చాలా బలంగా విస్తరించివుంది. ఈ ఘటనను బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టి ఖండించారు. బాధిత కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ఘటన వెనకున్న ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారి తప్పించుకోలేరని తేల్చి చెప్పారు. అయితే, ఈ కాల్చివేత ఘటనకు సంబధించి బీఎల్ఏ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments