Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్లపై యుద్ధ విమానాలను మొహరిస్తున్న పాకిస్థాన్.. భారత్‌పై దాడికేనా?

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ ఆర్మీ సెక్టార్‌పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి 18 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న విషయం తెల్సిందే.

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (15:18 IST)
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ ఆర్మీ సెక్టార్‌పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి 18 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న విషయం తెల్సిందే. దీని వెనుక పాకిస్థాన్ హస్తమున్నట్టు ప్రపంచం కోడై కూస్తోంది. అదేసమయంలో పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాలని దేశీయంగా తీవ్రమైన ఒత్తిడులు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో.. భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి మరింత ఊతమిచ్చేలా యుద్ధ విమానాలను పాకిస్థాన్ రోడ్లపైకి తెస్తోంది. కేవలం శిక్షణ కోసమే ఈ యుద్ధ విమానాలను రోడ్లపైకి తెస్తున్నట్టు పాక్ బుకాయిస్తోంది. 
 
అయితే, దేశ రాజధాని ఇస్లామాబాద్, లాహోర్ మధ్య రహదారిని మూసేసి మరీ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇది సాధారణ శిక్షణేనని, యురీ ఘటన నేపథ్యంలో పెరిగిన ఉద్రిక్తలు కారణం కాదని వైమానిక దళాధికారులు చెప్తున్నారు. 
 
పాకిస్థాన్ వైమానిక దళం అధికార ప్రతినిధి కమొడోర్ జావేద్ మహ్మద్ అలీ మాట్లాడుతూ విమానాలు రోడ్లపైకి వచ్చాయని, కొన్నేళ్ళుగా వాళ్ళు ఇలాగే చేస్తున్నారన్నారు. రన్‌వేలు పాడైనా, అందుబాటులో లేకపోయినా ఈ డ్రిల్ ఉపయోగపడుతుందన్నారు. ఈ విన్యాసాలను ఇటీవల భారత్‌తో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో నిర్వహించడం లేదన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments