Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్ బుక్ లవ్‌లో నయా ట్విస్ట్ : అంజూ వీసా గడువు పొడిగించిన శత్రుదేశం

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2023 (12:10 IST)
ఫేస్‌బుక్ ప్రియుడిని వెతుక్కుంటూ పాకిస్తాన్ వెళ్లి అంజూ వీసా గడువును పాకిస్థాన్ ప్రభుత్వం పొడగించింది. భార్త, ఇద్దరు పిల్లలు, కుటుంబాన్ని వదిలివేసి తన ఫేస్‌బుక్ ప్రియుడి కోసం పాకిస్థాన్ వెళ్లిన రాజస్థాన్ వివాహిత అంజు.. ప్రస్తుతం పాక్ ప్రియుడిని పెళ్లి చేసుకుని అక్కడే ఉంటున్నారు. ఈమెకు పాక్ ప్రభుత్వం మంజూరు చేసిన వీసా గడువు ఈ నెల 20వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ వీసా గడువును పాక్ ప్రభుత్వం పొడగించింది. మరో యేడాది పాటు తమ దేశంలో ఉండేందుకు వీలుగా ఈ వీసా గడువును పొడగించింది.
 
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అంజూ... భారత్‌లోని తన భార్త, ఇద్దరు పిల్లలు, అత్తమామలు, మరిది, తల్లిదండ్రులను వదిలిపెట్టి ఫేస్‌బుక్‌లో పరిచయమైన పాకిస్థాన్ ప్రియుడి కోసం దేశ సరిహద్దులను దాటి వెళ్లింది. సరిహద్దులను దాటిన తర్వాత తన స్నేహితుడిని కలుసుకోవడంతో పాటు పాకిస్థాన్‌‍ను చూసేందుకు వచ్చినట్టు ఆరంభంలో చెప్పింది. ఆ తర్వాత రెండు రోజుల్లోనే ఆమె పాక్ ప్రియుడిని పెళ్లి చేసుకుని, తన పేరును కూడా ఫాతిమిగా మార్చుకున్నారు. 
 
మరోవైపు, అంజూపై మొదటి భర్త జైపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు విడాకులు ఇవ్వకుండానే అంజూ చేసుకున్న రెండో పెళ్లి చెల్లదని, ఆమెతో పాటు నస్రూల్లాపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో అంజూతో పాటు ఆమె రెండో భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి భార‌తి ఈజ్ బ్యాక్‌! చ‌దువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా.. (video)

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments