Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ ఎన్నికలు.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హఫీజ్‌కు గట్టిషాక్

పాకిస్థాన్ పార్లమెంట్ ఎన్నికలు బుధవారం జరిగాయి. ఈ ఎన్నికల్లో ముంబై పేలుళ్ల సూత్రధారి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హఫీజ్ సయీద్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న హఫీజ్‌ను

Webdunia
గురువారం, 26 జులై 2018 (09:40 IST)
పాకిస్థాన్ పార్లమెంట్ ఎన్నికలు బుధవారం జరిగాయి. ఈ ఎన్నికల్లో ముంబై పేలుళ్ల సూత్రధారి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హఫీజ్ సయీద్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న హఫీజ్‌ను ప్రజలు తిరస్కరించారు. ఆయనకు మద్దతిచ్చిన అల్లాహో అక్బర్ తెహరీక్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు.


అయితే, ఆయన మద్దతుదారులమని చెప్పుకుంటూ బరిలోకి దిగిన ఇండిపెండెంట్ అభ్యర్థులు కొందరు విజయం సాధించారు. మొత్తం 272 స్థానాలకుగాను ఎన్నికలు జరుగగా, ప్రభుత్వ ఏర్పాటులో ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు.
 
ఇకపోతే.. పాకిస్థాన్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహరీక్ ఇన్సాఫ్ పార్టీ 121 స్థానాల్లో ముందంజలో ఉంది. 58 స్థానాలతో రెండో స్థానంలో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ పార్టీ కొనసాగుతుండగా, 35 స్థానాలతో మూడో స్థానంలో బిలావల్ బుట్టో నేతృత్వంలోని పీపీపీ కొనసాగుతోంది.

ఇప్పటివరకూ సుమారు 55 శాతం కౌంటింగ్ పూర్తయినట్టు సమాచారం. మ్యాజిక్ ఫిగర్ కు ఏ పార్టీ చేరుకోని పరిస్థితి ఏర్పడటంతో పీపీపీ మద్దతు కోరాలని ఇమ్రాన్ ఖాన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

Chiru: మన శంకరవరప్రసాద్ గారు ముచ్చటగా మూడవ షెడ్యూల్ ని కేరళలో పూర్తి

Vijay Antony: భద్రకాళి కొత్త పొలిటికల్ జానర్ మూవీ : విజయ్ ఆంటోనీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments