Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక పాకిస్థాన్ పని మటాష్... డోనాల్డ్ ట్రంప్‌ నిషేధిత దేశాల జాబితాలో పాక్‌?

ఇకపై పాకిస్థాన్ పని మటాష్ కానుందా? అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే పాకిస్థాన్ పని అయిపోయినట్టేనని వారు అంటున్నారు. ముఖ్యంగా.. అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నిషేధిత దేశాల జాబితా

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (11:51 IST)
ఇకపై పాకిస్థాన్ పని మటాష్ కానుందా? అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే పాకిస్థాన్ పని అయిపోయినట్టేనని వారు అంటున్నారు. ముఖ్యంగా.. అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నిషేధిత దేశాల జాబితాలో పాకిస్థాన్ ఉంటే మాత్రం ఆ దేశం పని అయిపోయినట్టేనని వ్యాఖ్యానిస్తున్నారు. 
 
ట్రంప్‌ ప్రభుత్వం అమెరికాలోకి ప్రవేశం నిషేధించిన దేశాల జాబితాలోకి పాక్‌ కూడా చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వైట్‌హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ రెనిక్‌ ప్రైబస్‌ ధ్రువీకరించారు. ప్రస్తుతం ఏడు ముస్లిం ఆధిక్య దేశాలకు చెందిన శరణార్థులు అమెరికాలో ఆశ్రయం పొందకుండా.. వలస రాకుండా.. పౌరసత్వం పొందకుండా ఈ చట్టం నిషేధిస్తుంది. 
 
దీనిని పాకిస్థాన్‌కు కూడా వర్తింపజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దేశాల నుంచి ముప్పు పొంచి ఉందని గతంలో అమెరికా కాంగ్రెస్‌, ఒబామా ప్రభుత్వం కూడా అంగీకరించాయి. పాకిస్థాన్‌లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఆయా దేశాలకు వెళ్లి వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్‌, పాకిస్థాన్‌లకు వెళ్లిన వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తామని చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments