Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ వ్యూహాలతో ఏకాకులమై పోతాం : పాక్‌ ఆర్మీతో షరీఫ్‌

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న వ్యూహాలతో మనం ప్రపంచంలో ఏకాకులమై పోతామని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆ దేశ ఆర్మీ చీఫ్‌తో వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కాశ్మీరులో చెలరేగిన అల్లర్లు, ఉర

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (11:11 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న వ్యూహాలతో మనం ప్రపంచంలో ఏకాకులమై పోతామని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆ దేశ ఆర్మీ చీఫ్‌తో వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కాశ్మీరులో చెలరేగిన అల్లర్లు, ఉరీలో భారత సైన్యంపై ఉగ్రవాద దాడి దరిమిలా అంతర్జాతీయంగా ఏకాకిగా మారామని పాకిస్థాన్‌ ప్రభుత్వం వాపోయింది. 
 
షరీఫ్ ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం జరగడానికి ముందు పాక్‌ మిలిటరీ నాయకత్వం, షరీఫ్‌ సర్కారు మధ్య ఓ అజ్ఞాత ప్రదేశంలో రహస్య భేటీ జరిగింది. జైషే మహ్మద్‌, లష్కరే తాయిబా లాంటి ఉగ్రవాద సంస్థలపై ‘బయటకు కనబడే’ చర్యలు తీసుకోవాలని షరీఫ్‌ స్పష్టంచేశారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ వ్యాఖ్యానించారు. లేకుంటే ప్రపంచదేశాలు పాక్‌ను మరింత దూరం పెడతాయని ఆయన తన సైన్యాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా షరీఫ్ సోదరుడైన పంజాబ్‌ సీఎం షాబాజ్‌, ఐఎస్ఐ చీఫ్‌ రిజ్వాన్‌ల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. పోలీసులు జైషే, లష్కరే ఉగ్రవాదులను అరెస్టు చేసినప్పుడల్లా ఐఎస్ఐ రంగంలోకి దిగి వారిని విడుదల చేయిస్తోందని షాబాజ్‌ మండిపడ్డారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments