Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేం తలచుకుంటే ఢిల్లీని 5 నిమిషాల్లోనే లేకుండా చేస్తాం : పాకిస్థాన్ అణు శాస్త్రవేత్త

Webdunia
ఆదివారం, 29 మే 2016 (10:07 IST)
పాకిస్థాన్ అణు శాస్త్రవేత్త, ఆ దేశ అణు కార్యక్రమం రూపశిల్పి డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ ప్రపంచ దేశాలను నివ్వెరపరిచే వ్యాఖ్యలు చేశారు. అతని వ్యాఖ్యలు దుస్సాహసానికి పాల్పడే చర్యగా ఉన్నాయి. 
 
పాకిస్థాన్ తొలి అణు పరీక్ష ఆయన నేతృత్వంలో 1998లో జరిగింది. తొలి అణు పరీక్ష వార్షికోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్ తలచుకుంటే భారత రాజధాని ఢిల్లీని కేవలం ఐదు నిమిషాల్లో టార్గెట్ చేయవచ్చన్నారు. 
 
పాకిస్థాన్‌లోని రావల్పిండికి సమీపంలోని కహుటా నుంచి దాడి చేయడానికి వీలవుతుందన్నారు. తమ దేశం 1984లోనే అణ్వాయుధాలను సంపాదించి ఉండేదని, కానీ అప్పటి దేశాధ్యక్షుడు జనరల్ జియా ఉల్ హక్ అందుకు వ్యతిరేకించారని చెప్పారు.
 
కాగా, ఖాదిర్‌పై ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్న విషయం తెల్సిందే. ఈయన అణు రహస్యాలను ఇరాన్, సిరియా, ఉత్తర కొరియా దేశాలకు అందజేశారనే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ కొద్దిరోజుల పాటు గృహనిర్బంధాన్ని కూడా అనుభవించారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments