Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజింగ్‌లో విజృంభిస్తోన్న కరోనా వైరస్.. విమాన సేవలు బంద్...

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (09:12 IST)
బీజింగ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రెండో సారి పాజిటివ్ కేసులు బయటపడటంతో.. సుమారు 1255 విమానాలను రద్దు చేసింది. ఆ నగరానికి చెందిన రెండు విమానాశ్రయాలు మూతపడ్డాయి. దీంతో బీజింగ్‌లో దాదాపు 70 శాతం విమాన రాకపోకలు నిలిచిపోనున్నాయి. బీజింగ్‌లో తాజాగా ఓ మార్కెట్ నుంచి వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు తెలిపారు. 
 
ఫెంగ్‌టాయి జిల్లాలో ఉన్న జిన్‌ఫాడి మార్కెట్ నుంచి అత్యధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ప్రైమరీ, హైయర్ స్కూళ్ల విద్యార్థులు క్యాంపస్‌కు రావద్దు అని ఆదేశించింది. కాలేజీ విద్యార్థులు కూడా క్యాంపస్‌కు రావాల్సిన అవసరం లేదన్నారు. దీంతో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని.. మూడవ స్థాయి నుంచి రెండవ స్థాయికి ప్రకటించారు.
 
గత ఐదు రోజుల్లోనే ఆ నగరంలో పాజిటివ్ కేసుల సంఖ్య వంద దాటింది. ఒకవేళ అత్యవసం అనుకుంటే తప్ప, బీజింగ్ ప్రజలు ఎవరూ తమ ఇళ్లు దాటి బయటకు వెళ్లకూడదని ఆ నగర మున్సిపల్ అధికారి చెన్ బీయి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments