Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నేను మనిషిని కాదు.. పిల్లిని' అంటున్న ఆ యువతి.. నిజంగానే పిల్లి చేష్టలే.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2016 (14:39 IST)
ఆమె చూడటానికి అచ్చం మనిషిలాగానే కనిపిస్తుంది. కానీ... ఆమె మాత్రం తాను మనిషిని కాదని చెపుతోంది. పైగా.. తనలో అన్నీ పిల్లి లక్షణాలే ఉన్నట్టు చెప్పడమే కాదు.. అదేవిధంగానే నడుచుకుంటోంది. అంతేనా పిల్లిలాగానే కనబడేందుకు ఆ యువతి కూడా పిల్లి చెవులను తగిలించుకుంది. అప్పుడప్పుడు తోక కూడా తగిలించుకుని పిల్లిలాగే నాలుగు కాళ్లతో నడుస్తుంది. ఇంతకీ ఆ మహిళ ఎక్కడ ఉందో తెలుసా.. నార్వే దేశంలోని ఓస్లో నగరంలో ఉంది. పేరు నానో. వయస్సు 20 యేళ్లు. 
 
ఈ యువతి అందరిలాగానే ఉంటుంది. మనిషిలాగానే నడవగలుగుతుంది. మాట్లాడగలుగుతుంది. నవ్వగలుగుతుంది. కానీ, తనలో మనిషి లక్షణాలు ఏమాత్రం లేవంటోంది. తానొక పిల్లినని చెబుతోంది. చూడటానికి మనిషిలాగానే కనబడుతున్నా.. తనలో పిల్లి లక్షణాలే అధికమని చెబుతోంది. తనలో ఉన్న పిల్లి లక్షణాలను వివరిస్తూ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. 
 
ఇందులో ఆమె చెప్పిన విషయాలను పరిశీలిస్తే...'ఇతర పిల్లుల్లాగానే నాకూ నీళ్లంటే చాలా భయం. నోటితో చేసే చిన్న చిన్న ధ్వనుల ద్వారా భావవ్యక్తీకరణ చేయగలను. నాకూ పాలంటేనే ఎక్కువ ఇష్టం. నేను యుక్త వయస్సు వచ్చే వరకు అందరిలాగానే ఉన్నాను. కానీ, 18 సంవత్సరాల వయసులో తెలిసింది. నేను మనిషిని కాదు.. పిల్లినని. అందుకే నన్ను నేను పిల్లిగానే భావిస్తా'నని చెప్పింది.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments