Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పును సరిదిద్దుకున్నారు.. తాత వర్ధంతికి కిమ్.. 15 కుందేళ్ళను పెంచాలని..?

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (19:44 IST)
ఉత్తర కొరియా నిర్మాత, ఆ దేశాన్ని పాలించిన మొదటి వ్యక్తి కిమ్ తాత కిమ్ 2 సంగ్. కొరియా రెండు భాగాలుగా విభజించబడిన తర్వాత ఆ దేశానికి నాయకత్వం వహించిన మొదటి వ్యక్తి ఇతను. ఆ దేశ ప్రజలు కిమ్ 2 సంగ్‌ను దేవుడి రూపంగా భావిస్తారు. అతను ఇంకా బతికే ఉన్నాడని నమ్ముతారు. అతని తర్వాత కిమ్ తండ్రి, ఇప్పుడు కిమ్ ఆ దేశాన్ని పాలిస్తున్నాడు. 
 
అయితే ఆ దేశ నిర్మాతగా భావించే తన తాత జయంతికి కిమ్ హాజరు కాలేదు. దీంతో కిమ్ మరణించాడని అందుకే ఎప్పుడూ లేని విధంగా ఇంత ముఖ్యమైన కార్యక్రమానికి హాజరు కాలేదని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వార్తల ప్రభావం ఆ దేశంపై భారీగానే పడింది. దీంతో కిమ్ ఇప్పుడు తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు. గురువారం తన తాత గారి 26వ వర్థంతిని కిమ్ ప్రభుత్వం అంగ రంగ వైభవంగా జరిపించింది. ప్రతి ఒక్కరు కూడా నల్లని డ్రెస్ లో ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. 
 
ఈ కార్యక్రమానికి హాజరైన ఏ ఒక్కరు మాస్కు ధరించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వేడుకల సందర్భంగా కిమ్ మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. తమ దేశంలోని సైనికులు ప్రతి ఒక్కరు తమ ఇంట్లో దాదాపు 15 కుందేళ్ళను పెంచాలని ఆదేశించాడు.
 
తమ దేశం పోష్టికాహార లోపం బారిన పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే కిమ్ నిర్ణయాన్ని ఏ ఒక్కరు పాటించకపోయినా, ఆకస్మిక తనిఖీల్లో లెక్క తక్కువగా వచ్చినా కఠిన శిక్షలు తప్పవని కూడా వార్నింగ్ ఇచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments