Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లైమాక్స్ దగ్గరపడింది : అమెరికాకు కిమ్ జాంగ్ ఉన్ వార్నింగ్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరోమారు అగ్రరాజ్యం అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అణుబాంబు ప్రయోగిస్తే ఉత్తరకొరియా సర్వనాశనమవుతుందని, ఊహకందని విధ్వంసాన్ని చూస్తారంటూ అమెరికా రక్షణ ప్రతినిధి

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2017 (13:54 IST)
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరోమారు అగ్రరాజ్యం అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అణుబాంబు ప్రయోగిస్తే ఉత్తరకొరియా సర్వనాశనమవుతుందని, ఊహకందని విధ్వంసాన్ని చూస్తారంటూ అమెరికా రక్షణ ప్రతినిధి జేమ్స్ మాటిస్ ప్రకటించిన వెంటనే కిమ్ తీవ్ర స్థాయిలో స్పందించారు.
 
అమెరికాకు ‘క్లైమాక్స్’ దగ్గరపడిందని వ్యాఖ్యానించారు. అమెరికా విచారకరమైన వైఫల్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. అమెరికా అంతం దగ్గరపడిందని, ఇదే ఫైనల్ వార్నింగ్ అంటూ స్పష్టం చేశారు. అదేసమయంలో దక్షిణకొరియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా చెప్పినట్టల్లా దక్షిణకొరియా తలాడించవద్దని హితవు పలికారు. దీంతో ఏ క్షణంలో ఏంజరుగుతుందోనని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
కాగా, అంతకుముందు జేమ్స్ మాటిస్ మాట్లాడుతూ... గువాం ద్వీపంపై దాడి చేస్తామంటూ ఊగిపోతున్న ఉత్తరకొరియాకు ఆయన ఝలక్ ఇచ్చారు. అదే గనుక జరిగితే ఎదురుదాడికి తాము వెనక్కి తగ్గబోమని స్పష్టంచేశారు. తాము గనుక యుద్దానికి దిగితే అది ఒక్క ఉత్తరకొరియాకే నష్టం కాదని, దాని పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, జపాన్ కూడా తీవ్రంగా నష్టపోతాయని హెచ్చరించారు.
 
అమెరికా అణుదాడికి ఈ మూడు దేశాల్లో శవాల గుట్టలు కనిపించేవని, దాని తీవ్రత ఊహించినంత భయంకరంగా ఉంటుందని తెలిపారు. 30 సెకెన్లకు 30,000 మంది, అరగంటలో 10 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని పేర్కొన్నారు. అయితే అలా జరగకూడదని అమెరికా భావిస్తున్నది గనుకే అమెరికా ఓపికతో వ్యవహరిస్తుందని తెలిపారు. అయితే, అణుదాడులు ప్రపంచ వినాశనానికే తప్ప అంతకుమించి వాటితో సాధించేది ఏమి లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments