Webdunia - Bharat's app for daily news and videos

Install App

కింగ్ జాంగ్ ఉన్‌పై జీవ రసాయన ఆయుధంతో దాడి.. ఉత్తర కొరియా

ఉత్తర కొరియా నియంత కింగ్ జాంగ్ ఉన్‌ను హత్య చేయాలని అమెరికా కుట్ర పన్నిందా? ఈ వార్త నిజమేనని అంటోంది ఉత్తర కొరియా. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ, సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ సర్వీసెస్‌లు సంయుక్తంగా

Webdunia
ఆదివారం, 7 మే 2017 (14:01 IST)
ఉత్తర కొరియా నియంత కింగ్ జాంగ్ ఉన్‌ను హత్య చేయాలని అమెరికా కుట్ర పన్నిందా? ఈ వార్త నిజమేనని అంటోంది ఉత్తర కొరియా. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ, సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ సర్వీసెస్‌లు సంయుక్తంగా కుట్ర పన్నాయని ఉత్తర కొరియా ఆరోపించింది. ఓ జీవ రసాయన ఆయుధాన్ని ప్రయోగించడం ద్వారా కిమ్‌ను హత్య చేయాలన్నది వారి పన్నాగమని, అది ఎప్పటికీ విజయవంతం కాదని, వారి ప్రయత్నం కలగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించింది. 
 
ప్రపంచ దేశాల ఆదేశాలను ధిక్కరించి ఉత్తర కొరియా వరుస క్షిపణి పరీక్షలు చేస్తున్న విషయం తెల్సిందే. పైగా, తమ సార్వభౌమత్వానికి విఘాతం కలిగేలా అమెరికా ప్రయత్నిస్తే, అణ్వస్త్రాల ప్రయోగానికి వెనుకాడబోమని ఉత్తర కొరియా హెచ్చరించింది. దక్షిణ కొరియాతో కలసి అమెరికా హద్దులు దాటుతోందని, ఈ రెండు దేశాలూ ప్రపంచానికి భూతాలుగా పరిణమించాయని ఉత్తర కొరియా రక్షణ శాఖ ఓ ప్రకటనలో ఆరోపించింది. 
 
దీనిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా సీఐఏతో కలసి దక్షిణ కొరియా వేసిన ప్లాన్‌ను తాము ఇటీవలే గుర్తించామని, సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో ఇటీవల దక్షిణ కొరియాను సందర్శించినప్పుడు ఈ ప్లాన్ వేశారని ఉత్తర కొరియా పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments