Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా పరికరాలు వాడొద్దు: బీఎస్‌ఎన్‌ఎల్‌కు కేంద్రం సూచన

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (17:53 IST)
ప్రస్తుతం చైనా బోర్డర్‌‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 4జీ అప్‌గ్రేడేషన్‌లో చైనా టెలికాం పరికరాలను ఉపయోగించొద్దని భారత్‌ సంచార్‌‌ నిగమ్‌ లిమిలెట్‌ (బీఎస్ఎన్‌ఎల్‌)కు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ (డీవోటీ) సూచించింది.

దీనికి సంబంధించి టెండర్‌‌ ప్రాసెస్‌ను కూడా సమీక్షించాలని చెప్పినట్లు అధికారులు చెప్పారు. ఎంటీఎన్‌ఎల్‌కు కూడా దీనికి సంబంధించి సమాచారాన్ని అందించినట్లు తెలుస్తోంది. అప్‌గ్రెడేషన్‌కు చైనా పరికరాలను ఉపయోగించొద్దని అనుబంధ సంస్థ మహానగర్‌‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఎంటీఎన్‌ఎల్‌)కు డీవోటీ సూచించింది.

సెక్యూరిటీ ఇష్యూస్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చైనా తయారు చేసిన సెక్యూరిటీ ఎక్విప్‌మెంట్‌ ఎప్పటికైనా డేంజరే అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారతీ ఎయిర్‌‌టెయిల్‌, వొడాఫోన్‌, ఐడియా హువాయితో కలిసి పనిచేస్తుండగా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం జెడ్‌టీఈతో కలిసి పనిచేస్తోంది.

కాగా.. చైనాకు చెందిన 52 యాప్‌లు యూజ్‌ చేయడం సేఫ్‌ కాదని, వాటి వాడకాన్ని తగ్గించాలని, లేదా బ్యాన్‌ చేయాలని సూచిస్తూ మన ఇంటెలిజెన్స్‌ అధికారులు సూచించారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments