Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు రాని బంగ్లా లాయర్లు!!

ఠాగూర్
బుధవారం, 4 డిశెంబరు 2024 (12:28 IST)
బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానపరిచాడన్న ఆరోపణలపై బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ఆధ్యాత్మిక గురువు చిన్మయ్ కృష్ణదాస్‌ను ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ మంగళవారం ఆ దేశ కోర్టుల్లో విచారణకు రాగా ఒక్కరంటే ఒక్క న్యాయవాది కూడా ఆయన తరపున వాదించేందుకు ముందుకారాలేదు. దీంతో ఆయన మరికొన్ని రోజులు పాటు జైలులోనే మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
కాగా, కొన్ని రోజుల కిందట చిన్మయ్ కృష్ణదాస్‌ను అరెస్టు చేసినప్పుడు ఆయన తరపున న్యాయవాది రీగర్ ఆచార్య కోర్టులో వాదనలు వినిపించారు. దాంతో, రీగన్ ఆచార్యపై కొందరు వ్యక్తులు తీవ్రస్థాయిలో దాడి చేశారు. రీగన్ ఆచార్యను బాగా కొట్టడంతోపాటు, ఆయన ఛాంబర్‌‌ను కూడా ధ్వంసం చేశారు.
 
ఈ నేపథ్యంలో, మంగళవారం చిన్మయ్ కృష్ణదాస్ కేసు విచారణకు రాగా, న్యాయవాదులు ఎవరూ ఆయన తరఫున వాదించేందుకు సాహసం చేయలేకపోయారు. విచారణ అనంతరం బంగ్లాదేశ్ కోర్టు తదుపరి విచారణను జనవరి 2వ తేదీకి వాయిదా వేసింది. 
 
దీనిపై పశ్చిమ బెంగాల్ ఇస్కాన్ అధికార ప్రతినిధి రాధారమణ్ దాస్ స్పందించారు. బంగ్లాదేశ్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, చిన్మయ్ కృష్ణదాస్ తరపున వాదించిన న్యాయవాది రీగన్ ఆచార్యపై కిరాతకంగా దాడి చేశారని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్మయ్ కృష్ణదాస్ తరఫున వాదించేందుకు ఏ న్యాయవాది ముందుకొస్తాడని ఆవేదన వ్యక్తం చేశారు.
 
చిన్మయ్ కృష్ణదాస్‌కు అండగా నిలిచిన రమేశ్ రాయ్ అనే ఇంకో న్యాయవాదిపైనా, మరో మద్దతుదారుడిపైనా దాడి జరిగిందని రాధారమణ్ దాస్ వెల్లడించారు. అంతేకాదు, దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిపాలైన న్యాయవాది ఫొటోను కూడా పంచుకున్నారు. ఇప్పుడా న్యాయవాది చావుబతుకుల మధ్య ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణదాస్ తరపున వాదించేందుకు ఏ ఒక్క న్యాయవాది కూడా ముందుకు రావడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పుష్ప-2' త్రీడీ వెర్షన్‌ విడుదలకు ముందు చిక్కులు... ఏంటవి?

అర్థరాత్రి బెన్ఫిట్ షోలు ఎవరి బెన్ఫిట్ కోసం వేస్తున్నారు? : తెలంగాణ హైకోర్టు ప్రశ్న

అల్లు అర్జున్ ఖాతాలో అడ్వాన్స్ బుకింగ్‌లతో కొత్త రికార్డ్

చిరంజీవి లేటెస్ట్ ఫొటో షూట్ - నాని సమర్పణలో శ్రీకాంత్ ఓదెలతో చిత్రం

సమంతకు ఇష్టమైన పనిని చేస్తున్న నాగచైతన్య, ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments