Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీరవ్‌ మోదీ జంప్.. బ్రిటన్ నుంచి బ్రస్సెల్స్‌ పరార్.. ఎలా పట్టుకుంటారో?

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు స్కాంలో ప్రధాన నిందితుడు నీరవ్‌ మోదీ బ్రిటన్ నుంటి బ్రస్సెల్స్‌కు పారిపోయాడు. భారత బ్యాంకులకు వేలకోట్ల రూపాయలను ఎగవేసిన నీరవ్ మోదీ.. లండన్ పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్న వేళ.. బ

Webdunia
గురువారం, 14 జూన్ 2018 (09:26 IST)
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు స్కాంలో ప్రధాన నిందితుడు నీరవ్‌ మోదీ బ్రిటన్ నుంటి బ్రస్సెల్స్‌కు పారిపోయాడు. భారత బ్యాంకులకు వేలకోట్ల రూపాయలను ఎగవేసిన నీరవ్ మోదీ.. లండన్ పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్న వేళ.. బ్రస్సెల్స్‌కు పారిపోయాడు. నీరవ్ మోదీ పరారీపై బ్రిటన్ ప్రభుత్వం నుంచి భారత దౌత్య కార్యాలయానికి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం అందలేదు.
 
అలాగే భారత్‌లో అతిపెద్ద బ్యాంకు కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ బ్రిటన్‌లో తలదాచుకున్నట్లు వార్తలొచ్చాయి. అక్కడి నుంచి పరారైన నీరవ్ మోదీ భారత పాస్‌పోర్టుతో కాకుండా సింగపూర్ పాస్‌పోర్టుపై పలాయనం చిత్తగించినట్టు తెలుస్తోంది. భారత దర్యాప్తు సంస్థ సీబీఐ సోమవారం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించింది. నీరవ్ మోదీ, ఆయన సోదరుడు నిషాల్‌కు వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాల్సిందిగా కోరింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13 వేల కోట్లకు టోకరా వేసి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై ఈ ఏడాది జనవరిలో కేసులు నమోదయ్యే ముందే వారిద్దరూ లండన్ వెళ్లిపోయారు. 
 
ఆయా కేసుల్లో సొమ్ము వెనక్కి రప్పించేందుకు సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తుండగా.. ఇప్పుడు భారత్‌లో కొందరి రాజకీయ లబ్ధి కోసం తనను వేధింపులకు గురి చేస్తారని, లండన్‌లోనే రాజకీయ శరణార్థిగా ఆశ్రయం కల్పించాలని నీరవ్ మోదీ కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడి నుంచి ప్రస్తుతం బ్రస్సెల్స్‌కు పారిపోవడం ఈడీకి తలనొప్పిగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments