Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా మేయర్‌ను ఇరికించిన ఎన్నారై...

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (15:09 IST)
విదేశాల్లో రెస్టారెంట్ పెట్టాడు. అది బాగానే జరుగుతోంది. మంచి పేరు కూడా ఉంది. కానీ మరింత డబ్బు సంపాదించడం కోసం మరో శాఖ పెట్టాలనుకున్నాడు. అదీ న్యూయార్క్ ప్రభుత్వ భూముల్లో. చివరికి ఓ మంత్రిని ఇరికించాడు. ఇది ఓ ప్రవాస భారతీయుడి ఘనకార్యం. బ్యాంక్ రుణాలు, ప్రభుత్వ స్థలాల కోసం ఆ ప్రాంత మేయర్‌ని వాడుకున్నాడు. 
 
న్యూయార్క్‌లో హరేంద్ర సింగ్ అనే ప్రవాస భారతీయుడు ప్రముఖ రెస్టారెంట్ నడుపుతున్నాడు. మరో బ్రాంచ్ పెట్టాలనే ఉద్దేశంతో బ్యాంక్ రుణాల కోసం ప్రయత్నించాడు. ప్రభుత్వ భూముల్లో కొత్త రెస్టారెంట్‌ని నిర్మించాలనుకున్నాడు. ఇందుకోసం ఆ ప్రాంత మేయర్‌ ఎడ్వర్డ్ మేంగనోకు లంచాలు ఇచ్చాడు. దానికి ఎడ్వర్డ్ కూడా సై అన్నాడు. అడిగిందే తడువుగా అనుమతులు ఇచ్చిపారేశాడు. 
 
బ్యాంక్ ఇచ్చే రుణాలకు ప్రభుత్వం హామీ ఉంటుందని చెప్పి రూ.కోట్లకు కోట్లు రుణాలు ఇప్పించాడు. ఈ తతంగమంతా ఇద్దరూ కలిసే చేశారు. ఎడ్వర్డ్ భార్య హరేంద్ర సింగ్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నారని చూపించారు. ఈ పొరపాటు ఎడ్వర్డ్ మెడకు ఉచ్చులా బిగుసుకుంది. ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణం కొనసాగించడం చూసి ప్రభుత్వం దర్యాప్తు చేసింది. హరేంద్ర సింగ్‌ని విచారణ జరిపింది. అతను అప్రూవల్‌గా మారి విషయం మొత్తం బయటపెట్టాడు. ఇప్పుడు ఆ కేసు రుజువైతే ఆ మంత్రికి, అతని భార్యకి కనీసం 20 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments