Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంతానోత్పత్తి కోసం కొత్త యాప్... నచ్చిన పురుషుడి వీర్యాన్ని ఆన్‌లైన్‌లో పొందవచ్చు..

టెక్నాలజీ బాగా పెరిగిపోతోంది. సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చాక మ‌నుష్యుల మ‌ధ్య సంబంధాలు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లకే పరిమితం అయ్యాయి. అనుకున్నది చిటికెలో సాధించుకునే ఆప్షన్ ఆన్‌లైన్‌లో ఉంది. టెక్నాలజీతో

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (11:10 IST)
టెక్నాలజీ బాగా పెరిగిపోతోంది. సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చాక మ‌నుష్యుల మ‌ధ్య సంబంధాలు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లకే పరిమితం అయ్యాయి. అనుకున్నది చిటికెలో సాధించుకునే ఆప్షన్ ఆన్‌లైన్‌లో ఉంది. టెక్నాలజీతో మనిషిని పోలిన మనిషిని సృష్టిస్తున్న ఇంటర్నెట్ యుగంలో భారత సంతతికి చెందిన ఒక వైద్యుడు సంతానోత్పత్తికి ఓ యాప్‌ను రూపొందించారు. 
 
ఈ యాప్‌లో ఎత్తు, కళ్ల రంగు, కేశాలు, ఇతరత్రా అంగసౌష్టవం వంటి వివరాలతో పురుషుల ఫొటోలు , వివరాలు పొందింపరిచారు. ఈ వివరాల ద్వారా తమకు నచ్చిన పురుషుని వీర్యాన్ని మహిళలు పొందవచ్చని డాక్టర్ అహుజా వెల్లడించారు. ఈ సరికొత్త యాప్ పై బ్రిటన్ లో యమ క్రేజ్ ఏర్పడింది. చాలా క్లినిక్ లు ఈ యాప్ సేవలు వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నాయి. సంతానోత్పత్తి కోసం రూపొందించిన 'ఆర్డర్ ఏ డాడీ' యాప్ ప్రపంచంలోనే మొదటిదని అహుజా వెల్లడించారు. 
 
లండన్‌లో 'సైంటిఫిక్ స్పెర్మ్ బ్యాంకు' డైరెక్టర్ డాక్టర్ కమల్ అహుజా అమ్మ అయ్యే స్త్రీల కోసం 'ఆర్డర్ ఏ డాడీ' యాప్‌ను రూపొందించారు. సంతానోత్పత్తిని కోరుకునే మహిళలు ఈ యాప్ ద్వారా తమకు నచ్చిన పురుషుడి వీర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ యాప్ పూర్తిగా చట్టబద్ధమైందని.. దీని ద్వారా వీర్యాన్ని పొందాలనుకునేవారు 950 పౌండ్లు చెల్లించాల్సి వుంటుంది. ఈ మొత్తాన్ని చెల్లించిన వారికి వారు కోరుకున్న సంతానోత్పత్తి కేంద్రంలో వీర్యాన్ని అందజేస్తారు.
 
ఇప్పటికే చైనాతో పాటు అన్ని దేశాల్లో ఆన్‌లైన్‌లో వీర్యం అమ్ముడు కార్యక్రమం జోరందుకుంది. తాజా యాప్ ద్వారా అతి సులభంగా సంతానోత్పత్తి కోసం మహిళలు వీర్యాన్ని పొందవచ్చునని అహూజా వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments