Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారిద్దరూ తల్లీకొడులు.. ప్రేమించుకున్నారు... ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు...

వారిద్దరూ స్వయానా తల్లీకొడుకులు. తల్లి వయసు 36 యేళ్లుకాగా, కుమారుడి వయసు 19 యేళ్లు. వీరిద్దరూ కలిసి ఓ నీచపు పనికి పూనుకున్నారు. సభ్యసమాజం తలదించుకునే పని చేశారు. వీరిద్దరు చేసిన పాడుపనికి నేరం రుజువైత

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (09:41 IST)
వారిద్దరూ స్వయానా తల్లీకొడుకులు. తల్లి వయసు 36 యేళ్లుకాగా, కుమారుడి వయసు 19 యేళ్లు. వీరిద్దరూ కలిసి ఓ నీచపు పనికి పూనుకున్నారు. సభ్యసమాజం తలదించుకునే పని చేశారు. వీరిద్దరు చేసిన పాడుపనికి నేరం రుజువైతే ఇద్దరికీ జైలుశిక్ష పడనుంది. న్యూమెక్సికో నగరంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
న్యూమెక్సికోకు చెందిన మోనికా మారెస్ (36), కాలబ్ పీటర్సన్(19) తల్లీ కొడుకులు. కొన్నాళ్ల తర్వాత పీటర్సన్‌ను తల్లిదండ్రులు వేరేవారికి దత్తత ఇచ్చారు. అయితే, గత యేడాది క్రిస్మస్ సందర్భంలో కుమారుడిని మోనికా తొలిసారి కలిసింది. ఆ తర్వాత తరచూ ఫేస్‌బుక్‌ ద్వారా చాటింగ్‌లు చేసుకుంటూ వచ్చారు. 
 
రోజులు గడిచే కొద్దీ.. పీటర్సన్‌ ప్రవర్తనలో మార్పు వచ్చింది. తల్లి మోనికా అంటే ఇష్టం పెంచుకున్నాడు. ఎంతలా అంటే ఆమెను ప్రేమించేంతంగా. ఓ రోజు ఇదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. ఆ తర్వాత నుంచి ఆమెకు కూడా కొడుకు పట్ల అదే ఫీలింగ్స్ కలిగాయి. దీంతో ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని చాలాకాలం పాటు దాచి ఉంచి జీవనం కొనసాగిస్తూ వచ్చారు. ఓ రోజున వారు చేసిన పాడుపని బయటపడింది. 
 
దీంతో తమ చేసిన పాడు పనిని కప్పించుకునేందుకు సరికొత్త ఎత్తు వేశారు. జెనటిక్ సెక్సువల్ అట్రాక్షన్(జన్యు లైంగిక ప్రేమ(ఆకర్షణ)పై ప్రజల్లో అవగాహన పెంచేలా ప్రచారం చేస్తున్నట్టు నటిస్తూ.. తమ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇక్కడే వారిద్దరూ తప్పు చేశారు. దేశ చట్టాల గురించి పెద్దగా అవగాహన లేక పోవడంతో వారు చిక్కిపోయారు. జెనటిక్ సెక్సువల్ అట్రాక్షన్‌పై అమెరికా, బ్రిటన్‌లో నిషేధం ఉంది. దీంతో వీరిద్దరూ చట్టం ముందు తలొంచుకుని నిలబడాల్సి వచ్చింది. ఈ నేరం రుజువైతే వారిద్దరూ 18 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం