Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు.. నిద్రపోతున్న మహిళ బ్లాంకెట్‌ను తొలగించి?

ముంబై నుంచి న్యూజెర్సీలోని నెవార్క్ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో అమెరికాలో నివసిస్తున్న ఓ భారతీయుడు విమానంలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళను అసభ్యంగా తాకాడు. ఇందుకుగాను క్షమాపణ కోరుతూ అతను లే

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (10:58 IST)
ముంబై నుంచి న్యూజెర్సీలోని నెవార్క్ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో అమెరికాలో నివసిస్తున్న ఓ భారతీయుడు విమానంలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళను అసభ్యంగా తాకాడు. ఇందుకుగాను క్షమాపణ కోరుతూ అతను లేఖలు రాశాడని అధికారులు చెప్పారు. తనను లైంగికంగా తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో ఎయిర్‌పోర్టు అధికారులు 40 ఏళ్ల గణేష్‌ పార్కర్‌ను అరెస్టు చేశారు. 
 
అతను నెవార్క్‌ ఫెడరల్‌ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నాడు. ఎయిరిండియా విమానంలో తనది బిజినెస్ క్లాస్ సీటైనప్పటికీ పార్కర్ ఎకానమీ క్లాసులో ఓ మహిళ పక్కన ఖాళీగా ఉన్న సీటులో కూర్చున్నాడు. నిద్రపోతున్న మహిళ తన బ్లాంకెట్‌ను ఎవరో తొలగించినట్లు అనిపిస్తే లేచి చూసింది. 
 
మళ్లీ నిద్రలోకి జారుకోగా.. పార్కర్‌ ఆమె చొక్కాలోకి చెయ్యిపెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో షాక్ తిన్న మీరు ఏం చేస్తున్నారని కేకలు వేసిందని అధికారులు తెలిపారు. దీంతో పార్కర్‌ను తనకు కేటాయించిన సీటు వద్దకు విమాన సిబ్బంది పంపించేశారు. అయితే, తాను మూర్ఖమైన చర్యకు పాల్పడ్డానని పార్కర్‌ అంగీకరిస్తూ.. క్షమాపణ నోటు రాసి పెట్టారని వారు వివరించారు. 50వేల డాలర్ల పూచీకత్తుమీద పార్కర్‌ జైలు నుంచి విడుదలైనా.. కొంతకాలంపాటు హౌస్‌ అరెస్టులో ఉండాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం