Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలను చూస్తే ఆ మంత్రికి అదే యావా...! అమాంతం కౌగిలించుకుంటాడు..!!

Webdunia
గురువారం, 2 జులై 2015 (22:17 IST)
అతగాడికి ఒళ్ళంతా అదో పిచ్చి... పైగా మంత్రి.. ఇక అడ్డులేదనుకుంటాడు. మహిళలు కనిపిస్తే చాలు కౌగిలించుకుంటాడు.. కాదంటే ముద్దు పెట్టుకుంటాడు. ఎంత వారించినా.. ఎందరున్నా అతనికి లెక్కలేదు. సిగ్గు అంతకంటే లేదు. వరినాట్ల పండగలో ఓ మహిళను కౌగిలించుకుని మంత్రి పదవే పోగొట్టుకున్నాడు. ఇంత పిచ్చి ఉన్న మంత్రి నేపాల్ కేబినెట్‌లో ఉన్నాడు. పేరు హరిప్రసాద్ పరాజులి. వివరాలివి. 
 
ప్రతియేటా నేపాల్లో వరినాట్ల ప్రారంభాన్ని ఉత్సవంలా చేస్తారు. దీనికే ఆయన వ్యవసాయ మంత్రి హోదాలో వెళ్లారు. వరినాట్లు వేసే కార్యక్రమానికి హాజరైన నేపాల్ వ్యవసాయ శాఖ మంత్రి హరిప్రసాద్ పరాజులి తన పని తాను చూసుకుని తిరిగి రావాలి. ఇది పద్దతి. కానీ అంతటితో ఊరుకోకుండా అక్కడికొచ్చిన మహిళలను కౌగలించుకోవడం, ముద్దుపెట్టుకోవడం ఇలాంటి పనులు చేశాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. 
 
మహిళలు వద్దు వద్దంటున్నా వినకుండా వాళ్లను పట్టుకోవడం లాంటి దృశ్యాలు వీడియోలలో కనిపించాయి. తెల్లటి టీషర్టు వేసుకుని, మెడలో వరినారు దండలా ధరించి మరీ ఆయన ఈ కార్యక్రమానికి వెళ్లారు. అయితే అక్కడ ఆయన చేసిన ఈ వ్యవహారం సోషల్ మీడియాలో రావడంతో ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో ఆయన సొంత పార్టీ సీపీఎన్-యూఎంఎల్ నాయకులు కూడా మండిపడ్డారు. 
 
ఒక మంత్రి పదవిలో ఉండి ఆయనలా ప్రవర్తించడం సరికాదని పార్టీ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు. దాంతో మంత్రి హరిప్రసాద్ పరాజులి రాజీనామా లేఖ సమర్పించగా, దాన్ని ప్రధాని సుశీల్ కొయిరాలా వెంటనే ఆమోదించారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?