Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ ప్రజలంతా నిజాయితీపరులా? నవాజ్ షరీఫ్ ప్రశ్న

తన దేశ ప్రజలను కించపరిచేలా పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు పాక్‌లో చర్చనీయాంశంగా మారాయి. పాకిస్థాన్ ప్రజలంతా నిజాయితీపరులా అంటూ షరీఫ్ ప్రశ్నించడం ఇపు

Webdunia
సోమవారం, 31 జులై 2017 (09:13 IST)
తన దేశ ప్రజలను కించపరిచేలా పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు పాక్‌లో చర్చనీయాంశంగా మారాయి. పాకిస్థాన్ ప్రజలంతా నిజాయితీపరులా అంటూ షరీఫ్ ప్రశ్నించడం ఇపుడు వివాదాస్పదంగా మారింది. 
 
పనామా గేట్ కుంభకోణంలో నవాజ్ షరీఫ్‌తో పాటు.. ఆయన కుటుంబ సభ్యులంతా చిక్కుకున్న విషయం తెల్సిందే. ఈ కేసులో పాక్ సుప్రీంకోర్టు షరీఫ్ కుటుంబ సభ్యులందరినీ నిందితులుగా ప్రకటించింది. ప్రధాని పదవికి షరీఫ్‌ను అనర్హుడిగా ప్రకటించింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
 
తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై షరీఫ్ మాట్లాడుతూ.. అందరూ తన కుటుంబాన్నే లక్ష్యంగా చేసుకున్నారని, ఆమాట కొస్తే పాకిస్థానీయులందరూ నిజాయతీపరులా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌లో ఉన్నవారందరూ నిజాయతీగా జీవిస్తున్నారా? అని ప్రశ్నించి కలకలం రేపారు. ఇక్కడ డబ్బు తీసుకున్నా సమస్యే, తీసుకోకున్నా సమస్యేనని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తప్పు చేసివుంటే నిర్భయంగా ఒప్పుకుంటానని తేల్చి చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments