Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ కల్లోలానికి రూ.100 కోట్ల నిధులు.. లాడెన్ నుంచి నవాజ్ షరీ‌ఫ్‌కు : ఇమ్రాన్

భారత్‌లో అంతర్భాగమైన భూతల స్వర్గం కాశ్మీర్‌లో కల్లోలం సృష్టించేందుకు పాకిస్థాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ భారీ కుట్రనే ప్లాన్ చేశారు. కాశ్మీర్‌లో కల్లోలం సృష్టించి.. శాంతిలేకుండా చేయాలని ఆయన కంకణం కట్టుక

Webdunia
బుధవారం, 10 మే 2017 (08:38 IST)
భారత్‌లో అంతర్భాగమైన భూతల స్వర్గం కాశ్మీర్‌లో కల్లోలం సృష్టించేందుకు పాకిస్థాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ భారీ కుట్రనే ప్లాన్ చేశారు. కాశ్మీర్‌లో కల్లోలం సృష్టించి.. శాంతిలేకుండా చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారట. ఇందుకోసం అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా వ్యవస్థాపకుడు బిన్ లాడెన్ నుంచి ఏకంగా రూ.100 కోట్ల నిధులు షరీఫ్ తీసుకున్నారట. ఈ విషయాన్ని పాకిస్థాన్ మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. 
 
ఇదే అంశంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి ఫవాద్ చౌదరి స్పందిస్తూ దేశంలో అస్థిరత పెంచేందుకు విదేశీయుల నుంచి షరీఫ్ నిధులు సేకరించిన ఆరోపణలపై పాకిస్థాన్ సుప్రీంకోర్టులో షరీఫ్‌పై కేసు వేయనున్నట్టు తెలిపారు. కశ్మీర్‌లో జిహాదీని పెంచి పోషించేందుకు అల్‌ఖాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని ఇమ్రాన్ ఆరోపించారు. అవినీతిలో చిక్కుకున్న నవాజ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 
 
తాము సేకరించిన ఆధారాలను బట్టి కాశ్మీర్, ఆఫ్ఘనిస్థాన్‌లలో జిహాద్‌ను ప్రమోట్ చేసేందుకు బిన్ లాడెన్ నుంచి షరీప్ రూ.100.50 కోట్లను తీసుకున్నారని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఇలా తీసుకున్న సొమ్ములో రూ.27 కోట్లను 1989లో అప్పటి ప్రధాని బేనజిర్ భుట్టోను గద్దె దిప్పేందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఉపయోగించారని వివరించారు. పైగా, తమ ఆరోపణలకు బలమైన సాక్ష్యాధారాలున్నాయని ఇమ్రాన్ పార్టీ పేర్కొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్‌'కు రూ.600 - 'డాకు మహారాజ్‌'కు రూ.500 బెనిఫిట్ షో టిక్కెట్ ధర ఖరారు!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్ర ట్రైలర్ విడుదల

'స్వప్నాల నావ'.. సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితం : దర్శకుడు వి.ఎన్.ఆదిత్య

'డాకు మహారాజ్‌' మనందరి సినిమా.. ఆదరించండి : నిర్మాత నాగవంశీ

పవన్ కళ్యాణ్ వున్నా, రామ్ చరణ్ వున్నా మూలాలు చిరంజీవిగారే: పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments