దొంగచాటుగా లండన్‌ వెళ్లిపోయిన నవాజ్ షరీఫ్?

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ దొంగచాటుగా లండన్ పారిపోయినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే, ఆయన అనుచరులు మాత్రం లండన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భార్యను చూసేందుకే ఆయన లండన్ వెళ్లార

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (17:02 IST)
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ దొంగచాటుగా లండన్ పారిపోయినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే, ఆయన అనుచరులు మాత్రం లండన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భార్యను చూసేందుకే ఆయన లండన్ వెళ్లారని చెపుతున్నారు.
 
అక్రమ రహదారి నిర్మాణానికి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఎన్‌ఏబీ షరీఫ్‌కు సమన్లు జారీచేసింది. అవినీతి ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు ప్రధాని షరీఫ్‌పై అనర్హత వేటువేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రధాని పీఠాన్ని త్యజించారు. 
 
ఈ పరిస్థితుల్లో నవాజ్ షరీఫ్ తన కుమార్తెతో కలిసి లండన్ వెళ్లారు. క్యాన్సర్ బారిన పడి లండన్ దవాఖానలో చికిత్స పొందుతున్న తన భార్య బాగోగులు చూసుకోవడానికి వెళ్లినట్టు సమాచారం. ఆయన తిరుగు ప్రయాణంపై ఎలాంటి సమాచారం లేదు. 
 
మరోవైపు, ఈ నెల 21వ తేదీన లాహోర్‌లోని నేషనల్ ఎకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఏబీ) సంయుక్త దర్యాప్తు బృందం ఎదుట ఆయన హాజరుకావాల్సి ఉంది. అలాగే, 23వ తేదీన అవినీతి కేసులో కూడా ఏప్రిల్ 23వ తేదీన ఆయన కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉన్నది. దాని నుంచి తప్పించుకొనేందుకు దేశాన్ని వీడారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే, ఆయన తిరిగి ఇస్లామాబాద్‌కు వచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments