Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోనాల్డ్ ట్రంప్ పవర్‌లోకి వచ్చాక శ్వేతసౌధంలోని ఉద్యోగులకు భద్రత లేదట

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు శ్వేతసౌధంలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో పని చేసే ఓ మహిళా ఉద్యోగి తేరుకోలేని షాకిచ్చింది. ట్రంప్‌ మాటలను, ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేస

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (09:21 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు శ్వేతసౌధంలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో పని చేసే ఓ మహిళా ఉద్యోగి తేరుకోలేని షాకిచ్చింది. ట్రంప్‌ మాటలను, ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇక తాను ఒక అమెరికా పౌరురాలిగా, ఓ ముస్లింగా మాత్రమే ఉంటానని తేల్చి చెప్పింది. 
 
నిజానికి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించాక కేవలం విదేశీయులకు మాత్రమే కాదు... స్వదేశీయులకు సైతం ఆయన వైఖరి చిరాకు పుట్టిస్తోంది. తాను ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడినని మరచి జాతివైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా నిత్యం ప్రకటనలు చేస్తూ ప్రజల్లో అభద్రతను పెంచుతున్నారు. 
 
దీంతో అమెరికా పౌరులే కాదు వైట్‌హౌస్‌లో పనిచేసే ఉద్యోగులు కూడా విసిగిపోతున్నారు. ఈ క్రమంలోనే వైట్‌హౌస్‌లో పనిచేసే ఓ మహిళ ట్రంప్‌ను వ్యతిరేకిస్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. బంగ్లాదేశ్‌ మూలాలు ఉన్న రుమానా అహ్మద్‌ అనే మహిళ 2011 నుంచి వైట్‌హౌస్‌లో, నేషనల్‌ సెక్యురిటీ కౌన్సిల్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఇదే అంశంపై ఆమె తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ‘ది అట్లాంటిక్‌’ అనే పత్రికకు ఓ లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి సారాంశాన్ని పరిశీలిస్తే... 
 
'మా పూర్వీకులు 1978లో బంగ్లాదేశ్ నుంచి అమెరికాకు వలస వచ్చారు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందాను. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి ఎంతో స్ఫూర్తిపొందిన నేను 2011లో వైట్‌హౌస్‌లో ఉద్యోగం సంపాదించాను. అలాగే, జాతీయ భద్రతా మండలి(ఎన్ఎస్‌సీ)లోనూ పని చేశాను. నేను నా అత్యున్నత విధానాల రక్షణకు కృషి చేస్తాను. నేను బురఖా ధరించే ఉద్యోగానికి వెళ్లాను. నేను ఈ బృందంలో హజీబ్‌ ధరించే ఏకైక మహిళను. ఒబామా ప్రభుత్వంలో నాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. తామంతా కలిసిమెలిసి పని చేశారం. 
 
కానీ డోనాల్డ్ ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక మమ్మల్ని అనుమానంగా చూస్తున్నారు. అయినా నేషనల్‌ సెక్యురిటీ కౌన్సిల్‌లో ఉండేందుకు ప్రయత్నించాను. ట్రంప్‌ నిషేధం విధించాక కూడా ఎనిమిది రోజులు విధులు నిర్వహించాను. అయితే రోజు రోజుకి ముస్లింల పట్ల ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 
 
నేను ఉద్యోగం వీడాలని నిర్ణయించుకున్న చివరి రోజు సాయంత్రం ట్రంప్‌ సీనియర్‌ నేషనల్‌ సెక్యురిటీ కౌన్సిల్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌ మిచెల్‌ ఆంటోన్‌కు సమాచారం చేరవేశాను. తొలుత ఆయన ఆశ్చర్యపోయారు. తర్వాత ప్రభుత్వం నుంచే వైదొలగుతున్నావా? అని అడిగారు. అంతేకానీ ఎందుకు అని మాత్రం ప్రశ్నించలేదు. నేను చాలా అవమానభారంతో మా దేశంలోని చారిత్రక భవనం నుంచి బయటికి వచ్చేశాను. నేను ఒక అమెరికన్‌గా.. ఒక ముస్లింగా ఉంటాను' అని ఆమె వ్యాఖ్యానించారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments