Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాక్‌ల మధ్య అణుయుద్ధం వచ్చే అవకాశాల్లేవు: ముషారఫ్

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (09:40 IST)
భారత్-పాకిస్థాన్ మధ్య అణుయుద్ధం వచ్చే అవకాశాలు ఎంతమాత్రమూ లేవని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అన్నారు. ఆ ప్రచారమంతా ఉత్తదేనని ముషారఫ్ వ్యాఖ్యానించారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య 2002 నాటి పరిస్థితులు మళ్లీ తలెత్తాయని వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యంగా గత దశాబ్దకాలంలో భారత్-పాక్ మధ్య శత్రుత్వం మరింత ఎక్కువైందని ముషారఫ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా తన దళాలను ఉపసంహరించి తర్వాత భారత్-పాక్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందని ముషారఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
యుద్ధమంటూ వచ్చి భారత్‌పై పాక్ ఒక బాంబు వేస్తే భారత్ 20 బాంబులు వేస్తుందని, అప్పుడు పాక్ మళ్లీ 50 బాంబులు వేయాల్సి వస్తుందని ముషారఫ్ వ్యాఖ్యానించారు. ఇది అత్యంత ప్రమాదకరమని, అణుయుద్ధం గురించి మాట్లాడేవారికి నిజానికి దానిపై ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments