Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో చర్చలు జరగాల్సిందే.. సర్వేలో పాకిస్థానీయుల ఓటు.. 60 శాతం ఓకే..

భారత్‌లో ముంబై పేలుళ్లకు అనంతరం దాయాది దేశమైన పాకిస్థాన్‌తో సంబంధాలు తెగతెంపులైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పాకిస్థాన్‌ క్రికెట్ జట్టుతో ప్రపంచకప్ మ్యాచ్ మినహా ఏ సిరీస్‌ను టీమిండియా కొనసాగించలేదు.

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (13:35 IST)
భారత్‌లో ముంబై పేలుళ్లకు అనంతరం దాయాది దేశమైన పాకిస్థాన్‌తో సంబంధాలు తెగతెంపులైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పాకిస్థాన్‌ క్రికెట్ జట్టుతో ప్రపంచకప్ మ్యాచ్ మినహా ఏ సిరీస్‌ను టీమిండియా కొనసాగించలేదు. తాజాగా భారత్‌లో ఉరీ ఉగ్రదాడి, పీఓకేలో భారత బలగాల సర్జికల్ స్ట్రైక్స్ ఘటనల తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. సరిగ్గా అదే ఈ సమయంలో భారత్-పాకిస్థాన్ సంబంధాలపై సంబంధాలపై ప్రఖ్యాత గాలప్ సర్వే సంస్థ పాకిస్థాన్‌లో ఉన్న తన శాఖ ద్వారా సర్వే నిర్వహించింది. 
 
పాకిస్థాన్‌లోని సింధ్, పంజాబ్, బలూచ్, ఖైబర్ ఫక్తూన్ క్వా రాష్ట్రాల్లోని పలు గ్రామాలు, పట్టణాల్లో సర్వేను చేపట్టింది. ఈ సర్వేలో సుమారు 2000 మందిని ఒకే ప్రశ్న అడిగారు. ''భారత్‌తో చర్చలకు మీరు అనుకూలమేనా?'' అనే ప్రశ్నపై 68 శాతం మంది చర్చలకే ఓటేశారు. అయితే 31 శాతం మంది మాత్రం వద్దని యాన్సర్ చేశారు. కేవలం ఒకే శాతం మంది తెలియంటూ సమాధానమిచ్చారు. 
 
చర్చల ద్వారానే దేశాలు స్నేహపూర్వకంగా ఉంటే.. దక్షిణాసియాలో తిరుగే ఉండదని మెజారిటీ పాకిస్థానీయులు అభిప్రాయం వ్యక్తం చేశారు. చర్చలకే పాకిస్థానీయులు అధిక శాతం మంది  ఓటేయడం ద్వారా పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, అక్కడి ఉగ్రవాద సంస్థలకు ఈ ఫలితాలు ఏమాత్రం మింగుడుపడటం లేదు. పాక్ ప్రజలు ఇరు దేశాల మధ్య సామరస్య వాతావరణం నెలకొనాలని భావిస్తుంటే.. పాక్ సైన్యం సరిహద్దుల వద్ద నిబంధనలు ఉల్లంఘించడం చేస్తోంది. ఇక తీవ్రవాదులు కాశ్మీర్ సమస్యను అడ్డుపెట్టుకుని విధ్వంసానికి పాల్పడుతున్నారని రాజకీయ నిపుణులు వాపోతున్నారు. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం