Webdunia - Bharat's app for daily news and videos

Install App

సియెర్రాలో దారుణం.. 300 మంది సజీవ సమాధి.. 600 మంది గల్లంతు

భారీ వర్షాల కారణంగా వరదలు సియెర్రా లియోన్‌లో దారుణం జరిగింది. సియెర్రా రాజధాని ఫ్రీటౌన్‌లో కొండచరియలు విరిగి పడి 300 మంది సజీవ సమాధి అయ్యారు. మరో 600 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (12:37 IST)
భారీ వర్షాల కారణంగా వరదలు సియెర్రా లియోన్‌లో దారుణం జరిగింది. సియెర్రా రాజధాని ఫ్రీటౌన్‌లో కొండచరియలు విరిగి పడి 300 మంది సజీవ సమాధి అయ్యారు. మరో 600 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల వరదలు ముంచెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
 
ఈ నేపథ్యంలో కొండచరియలు విరిగి పడటంతో బురదల్లో, మట్టి పెళ్లల కింద చిక్కుకపోయిన వారిని రక్షించేందుకు సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు 297 మృతదేహాలను వెలికి తీశారు. లియెర్రా లియోన్ అధ్యక్షుడు ఎర్నెస్ట్ బై కొరోమా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బుధవారం నుంచి ఏడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఈ దేశంలో ఐక్యరాజ్యసమితి కూడా సహాయక చర్యలు చేపట్టింది.
 
మృతి చెందిన వారిలో 105 మంది పురుషులు, 83 మంది మహిళలు, 109 చిన్నారులు వున్నారు. ఇంకా సహాయక చర్యలు జరుగుతుండటంతో మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు తెలిపారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం