Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బూ.. డబ్బూ.. డబ్బే డబ్బు.. దుబాయి రోడ్లపై కనక వర్షం

Webdunia
బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (15:14 IST)
కనక వర్షం కురిస్తే... అబ్బ ఎంత బాగుణ్ణు.. అసలు కనక వర్షం ఎలా ఉంటుందో కూడా తెలియని చూడని వారు చాలా మంది ఉంటారు. అది ఎలా ఉంటుందో ఈ మధ్య దుబాయివాసులు చూశారు. రోడ్లపై పడ్డ నోట్లను పట్టుకోవడానికి పరుగులు పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు. పది లక్షల పౌండ్ల డబ్బు రోడ్లపై వర్షలా కురిసింది. గాలికి నోట్లు కొట్టుకొచ్చాయి. అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో.. ఎలా వస్తున్నాయో.. తెలుసుకునే అవకాశం కూడా వారికి దక్కలేదు. కింద పడిన నోట్ల కోసం జనం ఆరాట పడం మాత్రం ఒకటే తెలిసింది. వివరాలిలా ఉన్నాయి. 
 
దుబాయిలోని ఓ ప్రాంతంలో రాత్రి రోడ్లపైకి, పుట్ పాత్ లపై నోట్లు కొ్ట్టుకొస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు. వేల కొద్ది నోట్లు కొట్టుకుని వస్తూనే ఉన్నాయి.  అన్నీ 500 దిర్హం నోట్లే. వాటిని ఏరుకోవడానికి జనం కార్లు, వాహనాలు నిలిపి రోడ్లపై పరుగులు పెట్టడడం మొదలు పెట్టారు. దీంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.  కొందరు తమ సెల్‌ఫోన్లలో ఆ దృశ్యాన్ని రికార్డు చేశారు. 
 
ఇలా సుమారు పది లక్షల పౌండ్ల విలువైన క్యాష్ కనక వర్షంలా కురిసి ప్రజల పాలయింది. ఇది ఎక్కడ నుంచి కొట్టుకు వచ్చిందనే అంశంపై ఒక నిర్ధారణ లేకపోయినప్పటికీ, తుఫానులోనే ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులు ఏటీఎంలో డబ్బును జమ చేయడానికి వెళ్తుండగా వారి వాహనం నుంచి సొమ్ము ఎగిరిపోయి ఉండవచ్చునని కూడా తెలుస్తోంది. ఇదే రోడ్లపైకి వచ్చి ఉంటుందని మాత్రమే అంచనా వేస్తున్నారు. అయితే ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కాలేదు

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments