Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాంజానియాలోని ఏకైక బిలియనీర్ కిడ్నాప్.. ఆచూకీ తెలిపితే రూ.3 కోట్లు

Webdunia
మంగళవారం, 16 అక్టోబరు 2018 (18:05 IST)
టాంజానియా ఆఫ్రికా దేశాల్లో ఒకటి. ఈ దేశంలోనే ఏకైక బిలియనీర్ మహ్మద్ డ్యూజీ. ఈయన భారత సంతతికి చెందిన కోటీశ్వరుడు. ఇటీవల ఈయన అవహరణకు గురయ్యారు. ఆయన ఆచూకీ కోసం టాంజానియా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కానీ, రవ్వంత కూడా ఆచూకీ తెలుసుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆచూకీ తెలిపితే రూ.3 కోట్ల మేరకు రివార్డు ఇస్తామని ఆ దేశ పోలీసులు ప్రకటించారు.
 
ఈ నెల 11వ తేదీన తెల్లవారుజామున వ్యాయామం కోసం దారుసలాంలోని కొలొసియం హోటెల్‌ వద్దకు రాగానే సాయుధులైన కొందరు దుండగులు ఆయనను కిడ్నాప్ చేశారు. 43 ఏళ్ల ఈ మాజీ రాజకీయనేత, పారిశ్రామికవేత్త. 'మో'గా ప్రసిద్ధి పొందారు. ఆఫ్రికాలోనే అత్యంత పిన్నవయస్కుడైన బిలియనీర్‌గా గుర్తింపు పొందారు. 
 
డ్యూజీ సంపద ప్రస్తుతం 1.5 బిలియన్‌ డాలర్లుగా ఫోర్బ్స్ మ్యాగజైన్ పేర్కొంది. ఆయనను టాంజానియాలో ఏకైక బిలియనీర్‌గా వెల్లడించింది. కాగా, ఈయన అపహరణ కేసులో పోలీసులు ఇప్పటి వరకు దాదాపు 20 మందికి పైగా అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments