Webdunia - Bharat's app for daily news and videos

Install App

184 దేశాలకు మోడీ కృతజ్ఞతలు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (17:11 IST)
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌ తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైంది. ఈ ఎన్నికల్లో భారత్‌కు మద్దతుగా నిలిచిన 184 దేశాలకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు.

బుధవారం రాత్రి ఎన్నికల్లో 193 దేశా ఓట్లు పోల్‌ కాగా, భారత్‌ 184 ఓట్లతో విజయం సాధించింది. ఈ విజయం భారత్‌కు ఇండియాకు గొప్ప పరిణామమని మోడీ పేర్కొన్నారు. భారత్‌కు మద్దతిచ్చిన దేశాలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.

పోటీ లేకుండానే భారత్‌ను గెలిపించారని, తమ దేశానికి దక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని, సభ్య దేశాలతో కలిసి పని చేస్తామని అన్నారు.

ప్రపంచంలో శాంతిని నెలకొల్పడం, సామరస్యం, భద్రత, సమానత్వం తదితర హక్కుల కోసం తమ పంథాను కొనసాగిస్తామని మోడీ చెప్పారు.
 
తాత్కాలిక సభ్య దేశంగా ఎనిమిదోసారి..
ఆసియా-పసిఫిక్‌ విభాగంలో 2020-21 కాలానికి అధిక మద్దతుతో ఎనిమిదోసారి గెలుపొందింది. 193 మంది సభ్య దేశాలున్న ఐరాస జనరల్‌ అసెంబ్లీలో 184 ఓట్లతో విజయం సాధించింది. దీంతో ఏకగ్రీవంగా భారత్‌ ఈ ఎన్నికల్లో గెలిచినట్లయింది.

భారత్‌తో పాటు ఐర్లాండ్‌, మెక్సికో, నార్వేలు కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించాయి. గతేడాది జూన్‌లో చైనా, పాకిస్తాన్‌తో సహా 55 దేశాలు ఆసియా-పసిఫిక్‌ విభాగానికి ప్రతినిధిగా భారత్‌ అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయి.

గతంలో భారత్‌ 1950-51, 1967-68, 1972-73, 1977-78, 1984-85, 1991-92తో పాటు 2011-12లో కూడా ఎన్నికైంది.

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments