Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరిగి రాడనుకున్న కేరళ వ్యక్తి.. 40 ఏళ్ల తర్వాత దుబాయ్‌లో ప్రత్యక్షం..

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (10:59 IST)
ఇక ఎప్పటికీ తిరిగిరాడనుకున్న కేరళ వ్యక్తి 40 ఏళ్ల తర్వాత దుబాయ్‌లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యంలో ముంచాడు. వివరాల్లోకి వెళితే..  కేరళకు చెందిన అబ్దుల్లా పునాతిల్ ఉస్మాన్ 1970లో ఉపాధి కోసం యూఏఈ వెళ్లాడు. అక్కడ కుక్గా పనిలో కుదిరి, ఆ తర్వాత ఎప్పుడూ సొంతూరుకు రాలేదు. 
 
అయితే ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు 40 ఏళ్లుగా గాలిస్తున్నారు. మీడియా, స్నేహితుల సాయంతో కూడా ప్రయత్నించి చూశారు. ఇక లాభంలేదనుకుని ఆశలు వదిలేసుకునే సమయంలో దుబాయ్లోని ఓ ఆస్పత్రిలో ఉస్మాన్ ఉన్నట్టు స్నేహితులు గుర్తించారు. 
 
తమ అనుబంధం గురించి చెబితే ఉస్మాన్ ఆశ్చర్యపోయాడు. ఇప్పటికే అదే ఉద్యోగం చేస్తూ ఒంటరి జీవితం గడుపుతున్నట్టు, రెండు నెలల క్రితం కాలిగాయంతో ఆస్పత్రిలో చేరినట్లు ఉస్మాన్ తెలిపాడు. ఉస్మాన్ను కేరళకు తీసుకువచ్చేందుకు అతని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఉస్మాన్ కూడా సొంతూరు రావాలని ఆశతో ఎదురు చూస్తున్నట్లు సమాచారం. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments