Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబర్ దాడులకు అమెరికానే కారణం.. టూల్ అక్కడే తయారైంది: మైక్రోసాఫ్ట్ ఫైర్

ప్రపంచంలో తొలిసారిగా అతిపెద్ద సైబర్ అటాక్ జరిగేందుకు ప్రధాన కారణం అమెరికా సర్కారేనని సాఫ్ట్ వేర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ ఫైర్ అయ్యింది. ఈ దాడులకు కారణమైన హ్యాకింగ్ టూల్‌ను అమెరికానే తయారు చేసిందని మైక

Webdunia
సోమవారం, 15 మే 2017 (12:27 IST)
ప్రపంచంలో తొలిసారిగా అతిపెద్ద సైబర్ అటాక్ జరిగేందుకు ప్రధాన కారణం అమెరికా సర్కారేనని సాఫ్ట్ వేర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ ఫైర్ అయ్యింది. ఈ దాడులకు కారణమైన హ్యాకింగ్ టూల్‌ను అమెరికానే తయారు చేసిందని మైక్రో సాఫ్ట్ ఆరోపించింది. గత రెండు రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సైబర్ దాడులతో ఐటీ నిపుణులు అప్రమత్తమైన సంగతి తెలిసిందే. హ్యాకర్ల నుంచి డేటాను రక్షించేందుకు నిపుణులు మల్లగుల్లాలు పడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో.. సైబర్ అటాక్‌కు కారణమనై హ్యాకింగ్ టూల్‌‌ను అమెరికా రూపొందించిందని.. ర్యాన్సమ్ వేర్‌ను తయారు చేసింది అమెరికానేనని... ర్యాన్సమ్‌వేర్‌ను రూపొందించిన అమెరికా కేంద్ర నిఘా సంస్థ.. దాన్ని సరిగ్గా దాచుకోలేకపోయిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. భద్రతా వ్యవస్థలోని డొల్లతనం వల్లే ఈ టూల్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లేలా చేసిందని మైక్రో సాఫ్ట్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. 
 
గత నెలలోనే ఇది ఆన్ లైన్లో లీక్ అయిందని సంస్థ ప్రతినిధి బ్రాడ్ స్మిత్ తన బ్లాగ్‌లో తెలిపారు. యూఎస్ సెంట్రల్ ఏజన్సీ వేలాది హ్యాకింగ్ టూల్స్ డెవలప్ చేసి ఎన్నో దేశాలపై నిఘా పెట్టినట్టు గతంలోనే వికీలీక్స్ వెల్లడించిందని స్మిత్ తన బ్లాగులో గుర్తుచేశారు. వారి నిర్లక్ష్యం కారణంగా తమ కస్టమర్లు నష్టపోయారని, అమెరికా సర్కారు ఇప్పటికే నిద్ర నుంచి మేల్కుంటే మంచిదన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments