Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెక్సికో బ్యూటీ ఆండ్రియా మెజాకు మిస్ యూనివర్స్ కిరీటం

Webdunia
సోమవారం, 17 మే 2021 (11:36 IST)
Andrea Meza
మిస్ యూనివర్స్ కిరిటాన్ని మెక్సికన్ బ్యూటీ మిస్ మెక్సికో ఆండ్రియా మెజా సొంతం చేసుకుంది. 73 మంది అందాల తారలు పోటీ పడగా ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్ గా గెలుపొందింది. ఈ సంవత్సరం ఈ అందాల భామల పోటీ మయామి, ఫ్లోరిడాలోని సెమినోల్ హార్డ్ రాక్ హోటల్, క్యాసినో హాలీవుడ్‌లో జరిగింది. డిసెంబర్ 8, 2019న మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న దక్షిణాఫ్రికాకు చెందిన తొలి నల్లజాతి మహిళగా జోజిబిని తుంజీ నిలిచింది. కరోనా మహమ్మారి కారణంగా తర్వాత మిస్ యూనివర్స్ పోటీలు వాయిదా పడాయి.
 
ఇక ఈ సంవత్సరం మిస్ మెక్సికో 69 వ మిస్ యూనివర్స్‌గా కిరీటం పొందింది. మిస్ మెక్సికో ఆండ్రియా మెజా ప్రపంచవ్యాప్తంగా 73 ఇతర అందమైన మహిళలతో పోటీపడి టైటిల్ గెలుచుకుంది. మిస్ ఇండియా, మిస్ బ్రెజిల్, మిస్ పెరూ మరియు మిస్ డొమినికన్ రిపబ్లిక్‌లతో పాటు ఆమె టాప్-5 లో చోటు దక్కించుకుంది. 
 
అందంతోనే కాదు అద్భుతమైన సమాధానంతో హృదయాలను గెలుచుకుంది. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆండ్రియా లింగ హింసకు వ్యతిరేకంగా వాదించింది. తన విజయంతో, మిస్ యూనివర్స్‌గా పట్టాభిషేకం చేసిన మూడవ మెక్సికన్ మహిళగా ఆండ్రియా నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments