Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాను వణికిస్తున్న మాథ్యూ హరికేన్.. ఏ క్షణమైనా తీరం తాకే ఛాన్సె స్

అమెరికాను మాథ్యూ హరికేన్ వణికిస్తోంది. ఇది ఏ క్షణమైనా తీరం తాకే అవకాశం ఉన్నట్టు ఆ దేశ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరం దాటే సమయంలో గంటకు 192 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెల

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (09:51 IST)
అమెరికాను మాథ్యూ హరికేన్ వణికిస్తోంది. ఇది ఏ క్షణమైనా తీరం తాకే అవకాశం ఉన్నట్టు ఆ దేశ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరం దాటే సమయంలో గంటకు 192 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ కారణంగా ఫ్లోరిడా, జార్జియా, దక్షిణ కరోలినాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 
 
కాగా, ఈ హరికేన్ ప్రభావం ఫ్లోరిడా, జార్జియా, దక్షిణ, ఉత్తర కరోలినాపై అధికంగా ఉంటుందని తెలిపారు. దీంతో ఇప్పటికే పది లక్షల వరకు ఇళ్లు అంధకారంలో చిక్కుకున్నాయి. భారీగా ఆస్తినష్టం సంభవించింది. తుఫాను ముప్పు నేపథ్యంలో డిస్నీ వరల్డ్, యూనివర్సల్ స్టూడియోస్, సీ వరల్డ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలను మూసివేశారు. మరోవైపు ఈ హరికేన్ కారణంగా ఇప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో పది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ
 
ఇంకోవైపు... అత్యంతప్రమాదకర నాలుగో కేటగిరీ వేగంతో వీచిన గాలులతో హైతీలో 478 మందిని బలిగొంది. అక్కడ తీవ్రత తగ్గించుకుని, మూడో కేటగిరీ తీవ్రత గాలులతో అమెరికాలో అడుగుపెడుతోందని వార్తలు వెలువడడంతో అమెరికన్లు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో, ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎమర్జెన్సీని ప్రకటించారు.
 
గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తుండగా, ఈ రెండు రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో 5.50 లక్షల మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో, సుమారు 4,300 విమాన సర్వీసులను రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు. మరికొన్ని గంటల్లో 'మాథ్యూ' హరికేన్ ఫ్లోరిడాను తాకనుందని అమెరికా వాతావరణ కేంద్రం ప్రకటించగా, ఇప్పటికే ఫ్లోరిడా తూర్పుతీరంలో బలమైన గాలులు వీస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments