Webdunia - Bharat's app for daily news and videos

Install App

బయటకొచ్చిన 7 నిమిషాల తర్వాత విస్ఫోటనం.. ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న భారతీయ వైద్యురాలు

ఇంగ్లండ్‌‌లోని మాంచెష్ట‌ర్‌లో జరిగిన ఉగ్రదాడి నుంచి ఓ భారతీయ వైద్యురాలితో పాటు ఆమె కుమార్తె సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. సోమవారం రాత్రి మాంచెస్టర్‌, ఎరీనా వద్ద జరిగిన సంగీత విభావరి ముగిసిన తర్వాత

Webdunia
బుధవారం, 24 మే 2017 (09:07 IST)
ఇంగ్లండ్‌‌లోని మాంచెష్ట‌ర్‌లో జరిగిన ఉగ్రదాడి నుంచి ఓ భారతీయ వైద్యురాలితో పాటు ఆమె కుమార్తె సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. సోమవారం రాత్రి మాంచెస్టర్‌, ఎరీనా వద్ద జరిగిన సంగీత విభావరి ముగిసిన తర్వాత సరిగ్గా 7 నిమిషాలకు ఈ ఉగ్రదాడి జరిగినట్టు భారతీయ వైద్యురాలు సోనాల్ పాఠక్ (41), ఆమె 13 ఏళ్ల కుమార్తె శ్రేయ వారు చెపుతున్నారు. వీరిద్దరు జైపూర్ వాసులు. 
 
సోమవారం రాత్రి మాంచెస్టర్‌లో మాంచెస్టర్ ఎరీనా వద్ద జరిగిన ఉగ్రదాడిలో 22 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడిన విషయం తెల్సిందే. ఈ దాడి నుంచి తప్పించుకున్న సోనాల్ పాఠక్ స్పందిస్తూ "షో చివరిలో రద్దీ నుంచి బయటపడటానికి మా వాహనాన్ని కొంత దూరంలో పార్క్ చేశాం. చివరి పాట అయిపోయిన వెంటనే బయటపడేందుకు ఎదురుచూస్తున్నాం. షో అవగానే వడివడిగా అడుగులేస్తూ పార్కింగ్‌ ప్రదేశానికి చేరుకున్నాం. మేం బయటకు వచ్చిన సరిగ్గా ఏడు నిమిషాల తర్వాత పేలుడు సంభవించింది" అని పాఠక్ గుర్తు చేసుకున్నారు. 
 
తాము రాత్రి 10:23 గంటలకు బయటకు వస్తే 10:30 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించిందన్నారు. అయితే తన పార్కింగ్ అండర్ గ్రౌండ్‌లో ఉండటంతో తాను పేలుళ్లను చూడలేదని, తనకు పేలుడు శబ్దాలు వినిపించలేదన్నారు. పార్కింగ్ నుంచి బయటకు వచ్చాక గానీ ఈ దారుణ ఘటన గురించి తెలియలేదని ఆమె విషణ్ణవదనంతో చెప్పుకొచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు ల‌ ఒసేయ్ అరుంధతి

హీరో సూర్య 45 సినిమా ఆనైమలైలో గ్రాండ్ గా లాంచ్

మహేష్ బాబు లాంచ్ చేసిన ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments