Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లో బెంగాలీ రెస్టారెంట్.. వెయిటర్ మీట్ ఉడకలేదన్నాడు.. చెఫ్ కంట్లో కారం కొట్టాడు.. కంటి చర్మం?

వీకెండ్.. ఇంట్లో వంట వద్దనుకున్న బ్రిటన్ జంట భారతీ రెస్టారెంట్‌కు వెళ్లింది. అయితే ఆ జంటకు షాకే మిగిలింది. వివరాల్లోకి వెళ్తే... బ్రిటన్ లోని బోధనా రంగంలో పని చేస్తున్న డేవిడ్‌ ఇవాన్స్‌ (46), మిషెల్లీ

Webdunia
మంగళవారం, 24 జనవరి 2017 (11:19 IST)
వీకెండ్.. ఇంట్లో వంట వద్దనుకున్న బ్రిటన్ జంట భారతీ రెస్టారెంట్‌కు వెళ్లింది. అయితే ఆ జంటకు షాకే మిగిలింది. వివరాల్లోకి వెళ్తే... బ్రిటన్ లోని బోధనా రంగంలో పని చేస్తున్న డేవిడ్‌ ఇవాన్స్‌ (46), మిషెల్లీ (47) దంపతులు సౌత్ వేల్స్‌లోని ఓ బెంగాలీ రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లారు. స్టార్టర్స్‌ ఆర్డర్ ఇచ్చిన ఆ దంపతులు అవి రుచిగా లేకపోయినా, తినడం ప్రారంభించారు. వెయిటర్ ఫీడ్ బ్యాక్ అడగడంతో అవి బాగోలేవని చెప్పి మెయిన్ కోర్స్ ఆర్డర్ ఇచ్చారు. అందులో మీట్ బాగా ఉడకలేదని చెప్పి దానిని పక్కన పెట్టి, మిగిలిన వంటకాలు తిన్నారు. 
 
వెయిటర్ మీట్ డిష్ పర్లేదా అని అడిగాడు. మీట్ ఉడకలేదని బ్రిటన్ జంట చెప్పింది. దీనిని  వెయిటర్ చీఫ్ చెఫ్ కమ్రుల్ ఇస్లాంకు తెలిపాడు. దీంతో ఆగ్రహానికి గురైన అతను వారిని తిట్టాడు. దీంతో తమనెందుకు తిడుతున్నావంటూ డేవిడ్ వంటగదికి వెళ్లి ఇస్లాంను ప్రశ్నించాడు. దీంతో తనపై దాడికి వచ్చాడని భావించిన ఇస్లాం అతని కళ్లలో కారం కొట్టాడు. దీంతో డేవిడ్ విలవిల్లాడిపోయాడు. అనంతరం నీటితో కడిగినా అంబులెన్స్ సిబ్బంది వచ్చి చికిత్స ప్రారంభించేంత వరకు తీవ్ర ఇబ్బంది పడ్డాడు. కారంతో దాడి చేయడంతో కళ్లలోపలి చర్మం కాలిపోయిందని, అతను పూర్తిగా కోలుకునే వరకు అతని పరిస్థితిని చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. అయితే కంట్లో కారం కొట్టిన చెఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments