Webdunia - Bharat's app for daily news and videos

Install App

Man Mums, ఒక్కసారి వాటేసుకుంటే రూ. 600 చెల్లిస్తున్న యువతులు, ఎందుకిలా?

ఐవీఆర్
శనివారం, 7 జూన్ 2025 (14:00 IST)
ఉద్యోగం వత్తిడి ఒకవైపు, ఇంటి సమస్యలతో సతమతం ఇంకోవైపు. తీరిక లేని జీవితం. విశ్రాంతి తీసుకున్నా బుర్రంతా వేడెక్కి కళ్లు వేడిబడి శరీరమంతా అలసిపోయి దిగాలుపడే జీవితం. ఇలాంటి వారి ఒత్తిడిని... ప్రత్యేకించి మహిళలు ఎదుర్కొనే అశాంతిని, మానసిక ఒత్తిడిని తగ్గించేసేందుకు Man mums రెడీగా వుంటున్నారు. ఇంతకీ ఏంటీ Man mums వ్యవహారం? అసలు విషయం ఏంటో తెలుసుకుందాము.
 
చైనాలో వర్కింగ్ ఉమెన్, ఇంటి బాధ్యతలతో సతమతమయ్యే మహిళలు కాసింత మానసిక ఉల్లాసం పొందేందుకు ఆశ్రయిస్తున్న ఒక సౌకర్యమే Man Mums. అంటే... ఈ మ్యాన్ మమ్స్ ఏం చేస్తారంటే, ఒత్తిడితో సతమతమయ్యే మహిళలకు స్వాంతన చేకూర్చేందుకు గాను వారిని ఓ 5 నిమిషాల పాటు కౌగలించుకుంటారు. వీరి కౌగిలి ఎలా వుంటుందంటే... సదరు వ్యక్తిని కౌగలించుకుంటే మనసులోని వ్యధితో పాటు శరీరపు అలసట అంతా మటుమాయం అయిపోతుందట. ఇలా కౌగలించుకున్నందుకు Man mum చేసే చార్జీ 5 నిమిషాలకు రూ. 600. చార్జీ ఎక్కువైనా సరే బాడీ రీచార్జింగ్ కోసం చైనా మహిళలు ఈ Man mumsను ఆశ్రయిస్తున్నారట.
 
వీళ్లలో ప్రస్తుతం మంచి డిమాండ్ వున్న హగ్ ప్రొవైడర్స్ రోజుకి కనీసం రూ. 21,000 ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. ఝౌ అనే యువకుడు ఒకరోజులో 34 కౌగిలింతలు ఇచ్చి రూ. 21,000 ఆర్జించినట్లు చెప్పాడు. తన కౌగలింత కోసం పలువురు మహిళలు ప్రత్యేకంగా కాల్ చేసి పిలిపించుకుంటారంటూ అతడు చెప్పడం గమనార్హం.
 
ఇదిలావుంటే.. ఈ మ్యాన్ మమ్స్ వ్యవహారం తెలిసిన మరికొందరు దీనిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. వాటేసుకుని ఒత్తిడి పోగొట్టుకునేందుకు ఇంట్లో మీ అమ్మ, నాన్న లేదా ఇతర కుటుంబ సభ్యులు లేరా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎవరినో అపరిచితుడిని కౌగిలించుకోవడం ఏమిటి, వారికి 5 నిమిషాలకే రూ. 600 ఇవ్వడం ఏంటి, పైత్యం పైస్థాయికి వెళితే ఇలాంటివే చేస్తారంటూ చురకలు అంటిస్తున్నారు. ఐతే ఈ మాటలను వారేమీ పట్టించుకోవడంలేదు. ఆప్యాయమైన కౌగిలి దొరికినప్పుడు దాని విలువ వెలకట్టలేనిది. అలాంటివారు Man Mumsలో వున్నారంటూ చైనా అమ్మాయిలు చెబుతున్నారు. వారి కౌగిలి ముందు తమ కుటుంబ సభ్యుల కౌగిళ్లు కూడా పనికిరావంటూ కొట్టిపారేస్తున్నారు. ఇంతలా చెబుతుంటే ఎవరైనా ఇంకేం చేస్తారూ?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments