Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకి కడుపు రాలేదని పక్కింటి వ్యక్తిపై కేసు పెట్టిన భర్త.. ఎక్కడ?

తన భార్యకి కడుపు రావట్లేదని పక్కింటి వాడి మీద కేసు పెట్టాడు ఓ భర్త. ఈ విచిత్ర ఘటన వివరాలను పరిశీలిస్తే.... తన భార్యకి గర్భం రాలేదు అని సౌపోలోస్ అనే భర్త తన పక్కింటి వాడి మీద కేసు పెట్టడం దుమారం రేపుతో

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (09:27 IST)
తన భార్యకి కడుపు రావట్లేదని పక్కింటి వాడి మీద కేసు పెట్టాడు ఓ భర్త. ఈ విచిత్ర ఘటన వివరాలను పరిశీలిస్తే.... తన భార్యకి గర్భం రాలేదు అని సౌపోలోస్ అనే భర్త తన పక్కింటి వాడి మీద కేసు పెట్టడం దుమారం రేపుతోంది. సేఫ్టీ గేట్ కోర్టు విచారిస్తున్న ఈ వింత కేసులో తన భార్యను గర్భవతిని చేయడంలో పక్కింటి 29 ఏళ్ల వ్యక్తి విఫలమయ్యాడంటూ భర్త అతడిని కోర్టుకు లాగాడు. తన భార్యని గర్భవతిని చెయ్యడం కోసం 2500 డాలర్లు చెల్లించానని.... కానీ అందుకు తగ్గ ఫలితం దక్కలేదని కేసు పెట్టాడు. 
 
సౌపోలోస్ భార్య మాజీ బ్యూటీ క్వీన్, మోడల్. ఈ దంపతులకు పిల్లలు పుట్టరని వైద్యులు పరీక్షించి సౌపోలోస్‌కు చెప్పారు. ఇక్కడే సౌపోలోస్‌కు ఒక వింత ఆలోచన కలిగింది. భార్యకి గర్భం రావడం కోసం పక్కింటి అతనితో ఒప్పందం కుదుర్చుకున్నాడు భర్త. ఆరు నెలల్లో వారానికి మూడు రోజుల చొప్పున సెక్స్‌లో పాల్గొనాలని మొత్తం డెబ్భై రెండు ప్రయత్నాల్లో ఖచ్చితంగా గర్భవతిని చేయాలని కండీషన్ పెట్టాడు.
 
డబ్బు తీసుకుని కూడా తన భార్యని గర్భవతిని చెయ్యలేక పోయాడు అని కోపంగా కోర్టుని ఆశ్రయించాడు భర్త. ఈ కేసును పరిశీలించిన కోర్టు జడ్జితో సహా అందరూ అవాక్కయ్యారు. మరి కోర్టు ఆ భర్తకు న్యాయం చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడ్వైజరీ బోర్డ్‌లో భాగం చేసినందుకు ప్ర‌ధాని మోదీకి చిరంజీవి ధ‌న్య‌వాదాలు

త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్

రమేష్ బాబు ఎందరినో మోసం చేసాడు, సివిల్ కోర్టులో కేసు నడుస్తోంది : -ఫైనాన్సియర్స్ సదానంద్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం