Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకులు తీసుకున్న ఆనందంలో బంగీ జంప్... వికటించి ఆస్పత్రిపాలు

Webdunia
మంగళవారం, 16 మే 2023 (09:21 IST)
గతంలో ఓ తమిళ నటి విడాకులు తీసుకున్న ఆనందంలో స్పెషల్ ఫోటో షూట్ నిర్వహించి, ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన భార్య నుంచి విడాకులు తీసుకున్న అనంతరం ఆనందంతో పెద్ద సాహసమే చేశాడు. అది కాస్తా వికటించడంతో ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు. బంగీ జంప్ చేసి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. 
 
బ్రెజిల్‌కు చెందిన రాఫెల్ డోస్ శాంటోస్ తోస్టా (22) అనే వ్యక్తి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. విడాకులు తీసుకున్న సందర్భంగా తనకు నచ్చిన పనులన్నీ చేస్తూ ఆనందంగా గడపాలనుకున్నాడు. అందులో భాగంగానే బంగీ జంప్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం బ్రెజిల్లోని కాంపో మాగ్రోలో బ్రిడ్జ్ స్వింగ్లో పాల్గొనడానికి వెళ్లాడు. 
 
ఆనందంగా 70 అడుగుల ఎత్తు నుంచి జంప్ చేయాలని వెళ్లి తాడు సాయంతో కిందకు దూకాడు. అంతలోనే తాడు తెగిపోవడంతో రాఫెల్ కిందనున్న నీటి కొలనులోకి పడిపోయాడు. అంత ఎత్తు నుంచి కిందకు పడటంతో మెడ విరిగింది. శరీరమంతా తీవ్ర గాయాలయ్యాయి. మొత్తానికైతే ప్రాణాలతో మాత్రం బయటపడ్డాడు. వాస్తవంగా ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జరగ్గా.. తాజాగా అతడు కోలుకోవడంతో వెలుగులోకి వచ్చింది.
 
'విడాకులు తీసుకున్న అనంతరం నేను బంగీ జంప్ చేయాలనుకున్నా. కానీ ఇలా అవుతుందని అసలు ఊహించలేదు. ఆ రోజు కళ్లు తెరిచే సమయానికి నీటిలో ఉన్నాను. చుట్టూ ఉన్న వారు 'కదలకు అలాగే ఉండు, నీకు సాయం చేయడానికి వస్తున్నారు' అంటూ ఉంటే అసలేం జరిగిందో నాకు అర్థం కాలేదు. చాలా భయం వేసింది. చివరకు ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాను. జీవితానికి ఎంతో విలువ ఉంది. దాన్ని లెక్క చేయకుండా ఎన్నో పిచ్చి పనులు చేశా' అంటూ రాఫెల్ ఆ ఘటన గురించి చెబుతూ పశ్చాత్తాపం వ్యక్తంచేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments