Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌదీలో ఇదేం పద్ధతి.. యూత్ ఇలా విడోల వెంట పడుతున్నారే?!

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (17:09 IST)
సౌదీ అరేబియాలో యువత తమ భాగస్వాములను ఎంపిక చేసుకోవడంలో కొత్తగా ఆలోచిస్తున్నారు . తమ వయస్సు, విద్యార్హత, ఉద్యోగం వంటి వాటిల్లో ఉన్నతంగా ఉండే యువతీయువకులు అదే అర్హతలతో కూడిన భాగస్వామిని ఎంపిక చేసుకోకుండా జీవితంలో ఓడిపోయిన వారు, విడోస్, విడాకులు తీసుకున్నవారి వెంటపడుతున్నారు. 
 
తాజాగా ఓ ఛారిటబుల్ సొసైటీ నిర్వహించిన సర్వేలో 77.3 శాతం మంది యువకులు.. విడోలు, విడాకులు తీసుకున్న మహిళల్ని పెళ్ళాడేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిసింది. ఇక 67.2 శాతం మంది భర్తను కోల్పోయిన వారిని పెళ్ళాడేందుకు రెడీగా ఉండగా, 74.6శాతం మంది తమ కంటే వయస్సుల్లో మీదున్న వారిని కూడా పెళ్ళాడేందుకు సై అంటున్నారు. దీనిపై సర్వే జరిపిన జెడ్డా-ఆధారిత ఛారిటబుల్ సొసైటీ అధినేత అబ్ధుల్లా బిన్ మొహ్మద్ మత్బౌలి మాట్లాడుతూ.. ప్రస్తుతం సౌదీలో మంచి ట్రెండ్ నడుస్తుందని చెప్పారు. 
 
తమ కంటే వయస్సులో పెద్దగా ఉన్నా.. విడోస్ అయినా.. విడాకులు తీసుకున్న మహిళల్ని పెళ్ళాడేందుకు ముందుకు రావడం గొప్పేనని తెలిపారు. విద్య ద్వారా యువతలో చైతన్యం వస్తుందని చెప్పారు. మహిళలకు గౌరవం ఇవ్వడం.. జీవితాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన మహిళలను యువతను ఎంచుకోవడం ఒకింతకు మంచి పరిణామమేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments