అమెరికాలో జాతిపిత మహాత్మ గాంధీకి అవమానం.. విగ్రహాన్ని కూల్చేశారు..

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (11:12 IST)
నల్లజాతీయులకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో నిరసనలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఇంకా నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి వ్యతిరేకంగా ఇటీవల వాషింగ్టన్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో మరోసారి జాతిపిత మహాత్మ గాంధీకి అవమానం జరిగింది. 
 
భారత రాయబార కార్యాలయం ఎదుట ఉన్న విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వాషింగ్టన్ డిసిలో జరిగిన ఈ ఘటనపై భారతీయులు మండిపడుతున్నారు. మహాత్ముడిని అవమానించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిరసనకారుల్లో కొంత మంది వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాని ప్రవాస భారతీయులు డిమాండ్ చేస్తున్నారు.

అయితే వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం వెలుపల ఉన్న గాంధీ విగ్రహం ధ్వంసం కావడంపై అమెరికా రాయబారి కెన్ జస్టర్ భారత్‌కు క్షమాపణలు చెప్పారు. ఇలా జరగడం పట్ల చింతిస్తున్నామన్నారు. క్షమాపణలను స్వీకరించాలని భారత్‌ను ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments