Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఫోటోను లీక్ చేసి జైలుపాలైన వికీలీక్స్ చీఫ్ అసాంజే?

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (12:24 IST)
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజేను లండన్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అసాంజే అరెస్టుకు కారణం ఓ ఫోటో. 
 
ప్రస్తుతం ఈక్వెడార్ దేశం తీవ్రదుర్భిక్షంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ ప్రజలు ఒక పూట అన్నం కోసం తల్లడిల్లిపోతున్నారు. కానీ, ఆ దేశ అధ్యక్షుడు లెనిన్ మొరెనో మాత్రం బెడ్‌పై పడుకుని లోబ్‌స్టర్ వంటి ఖరీదైన సీఫుడ్ ఆరగిస్తున్నట్టు ఉన్న ఓ ఫొటోను జూలియన్ అసాంజే లీక్ చేసినట్టు ఈక్వెడార్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో అసాంజేకు కల్పిస్తూవచ్చిన ఆశ్రయాన్ని ఉపసంహరించుకున్నాయి. 
 
ఫలితంగా ఎన్నో ఏళ్లుగా లండన్‌లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో ఉంటూ వచ్చిన అసాంజేను బ్రిటన్ పోలీసులు బయటికి ఈడ్చుకొచ్చిమరీ అరెస్టు చేశారు. అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘిస్తున్న కారణంగానే అసాంజేకు ఆశ్రయం ఉపసంహరించుకున్నట్టు ఈక్వెడార్ అధ్యక్షుడు లెనిన్ మొరెనో ప్రకటించారు.
 
కానీ, అసలు కారణం మాత్రం అధ్యక్షుడు లెనిన్ మొరెనోకు సీఫుడ్స్ ఆరగిస్తున్న ఫోటోను లీక్ చేయడమే. ఈక్వెడార్ దేశం తీవ్ర దుర్భిక్షంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో దేశాధ్యక్షుడు విలాసాల్లో మునిగితేలుతున్నాడు అనేలా ఆ ఫొటో ఉంది. ఈ కారణంగానే అసాంజేకు ఆశ్రయం వెనక్కితీసుకున్నట్టు సమాచారం. మొత్తంమీద ఎన్నో ఏళ్లుగా ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతూ వచ్చిన అసాంజే ఇపుడు జైలు భోజనం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం