Webdunia - Bharat's app for daily news and videos

Install App

యురి ఘటన.. పాక్ టెర్రరిస్టులు పిరికిపందలు.. ఐకామ్ హ్యాండ్‌సెట్ కూడా పాకిస్థాన్‌దే

జమ్మూ కాశ్మీర్‌లోని యురిలో టెర్రరిస్టులు ఆదివారం భార‌త‌ సైనిక స్థావరంపై దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పేలా సరిహద్దులు దాటి ప్రతిదాడులు జరిపేందుకు అనుమతించాలని భారత సైన్యం కేంద్రాన్ని క

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2016 (19:30 IST)
జమ్మూ కాశ్మీర్‌లోని యురిలో టెర్రరిస్టులు ఆదివారం భార‌త‌ సైనిక స్థావరంపై దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పేలా సరిహద్దులు దాటి ప్రతిదాడులు జరిపేందుకు అనుమతించాలని భారత సైన్యం కేంద్రాన్ని కోరుతోంది. ఈ దిశగా రాజకీయ నిర్ణయం తీసుకోవాలని ఓ వర్గం సైనికుల నుంచి ఒత్తిడి వస్తోంది. 
 
'పరిమితమైన సీమాంతర దాడి'కి తమకు అనుమతించాలని కొందరు డిమాండ్ చేసినట్టు సమాచారం. ముఖ్యంగా 778 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వెంబడి నిత్యమూ ఎక్కడో ఒకచోట పాక్ కాల్పులకు దిగుతూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యురిలో పాక్ ఉగ్రవాదులు చేసిన పిరికిపంద చర్యకు సంబంధించిన చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) చేసిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటికొస్తున్నాయి. తాజాగా పాక్ టెర్రరిస్టులు పిరికిపందలుగా వ్యవహరించారని తెలిసింది. ఈ దాడి కోసం ఉగ్రవాదులు ఉపయోగించిన ఐకామ్ అనే హ్యాండ్‌సెట్ కూడా పాకిస్థాన్‌కు చెందిన కంపెనీదేనని స్పష్టమైంది. ఇంకా జవాన్ల టెంట్‌లో మంటలు రాగానే కొందరు సైనికులు పక్కనే ఉన్న ఆఫీసర్స్ మెస్‌లోకి, స్టోర్ రూమ్‌లోకి వెళ్లారని తెలిసింది. ఉగ్రవాదులు మన సైనికులు ఉన్న మెస్‌కు, స్టోర్ రూమ్‌‌కు లాక్ చేశారని తేలింది.
 
దీంతో సైనికులు తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత ముష్కరులు వారిపై తూటాలతో దాడి చేయడంతో కొద్దిసేపటికే జవాన్లు ప్రాణాలు విడిచారు. అయితే ఇదంతా ఉగ్రవాదులు అప్పటికప్పుడు అనుకుని చేసిన పని కాదని, ముందు నుంచే ఈ ప్రాంతంలో పాగా వేసుండొచ్చని ఎన్‌ఐఏ అనుమానం వ్యక్తం చేస్తోంది. 
 
సైనికుల ధాటికి బలైపోతామనే భయంతోనే జవాన్లను అలా బంధించి చంపారని.. మెస్ డోర్లు లాక్ కాకుండా.. పాక్ ఉగ్ర ముష్కరులకు జాతీయ జవాన్లు చుక్కలు చూపించే వారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments