Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడు చేసిన పనికి ప్రియురాలి పెదవులకు 300 కుట్లు...

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (11:52 IST)
అమెరికాలో ఓ ప్రియుడు తన ప్రియురాలి పట్ల అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. ప్రేమ పేరుతో తనను వాడుకుని మోసం చేసినందుకు జీవితంలో గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలని భావించిన ఆ ప్రియుడు అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. ప్రియురాలిని దగ్గరకు తీసుకుని ముద్దు పెడతానని చెప్పి కింది పెదవిని కొరికిపారేశాడు. దీంతో ఆ యువతి పెదవులకు సర్జరీ చేసేందుకు 300 కుట్లు వేశారు. ఈ కిరాతక చర్యకు పాల్పడిన ఆ ప్రియుడుకి అమెరికా కోర్టు 12 యేళ్ల జైలుశిక్షను విధించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రీన్‌విల్లేకు చెందిన కైలా అనే యువతి సెథ్ ఆరన్ అనే యువకుడితో డేటింగ్ చేసింది. వీరిద్దరూ ఒక యేడాది పాటు డేటింగ్ చేశారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో సెథ్‌ను కైలా దూరంపెట్టసాగింది. ఓ రోజు కైలాను కలవడానికి వచ్చిన సెథ్ ఆమెకు గ్రీటింగ్ కార్డు ఇచ్చి... కలిసి ఉండాలని కోరాడు. సెథ్ తనను ఓ ప్రాపర్టీలా చూస్తున్నాడు కానీ.. మనిషిలా చూడటం లేదని అతనితో తెగదెంపులు చేసుకుని ఇంకెప్పుడూ కలవనని తెగేసి చెప్పేసింది. 
 
దీంతో ఆగ్రహించిన సెథ్.. తన ప్రియురాలు కైలాకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలని అనుకున్నాడు. అక్కడే ఆమెకు ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు. కానీ, సెథ్‌కు కైలా పక్కకు తోసేసింది. దీంతో మరింత ఆగ్రహించిన సెథ్... కైలాను గట్టిగా పట్టుకుని కింది పెదవిని కొరికిపారేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు సర్జరీ చేసి 300 కుట్లు వేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి సెథ్‌ను అరెస్టు చేయగా, స్థానిక కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును విచారించిన కోర్టు... సెథ్‌కు 12 ఏళ్ల జైలుశిక్షను విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments