కువైట్‌లో భారతీయుల మెడపై వేలాడుతున్న కత్తి?!

Webdunia
సోమవారం, 6 జులై 2020 (14:17 IST)
కువైట్ ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకోనుంది. విదేశీ జనాభా చట్టానికి ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే కువైట్ దేశంలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులు వెనక్కి రావాల్సివుంటుంది. అంటే దాదాపు 8 లక్షల మంది భారతీయులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. 
 
కరోనా మహమ్మారి కారణంగా కువైట్ కూడా తీవ్రంగా దెబ్బతింది. ఆర్థిక వ్యవస్థ పతనమైంది. మరోవైపు ఆ దేశంలోని విదేశీయుల జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. అధికార గణాంకాల ప్రకారం కువైట్‌లో మొత్తం జనాభా 48 లక్షలు. ఇందులో విదేశీయులు 34 లక్షలు. కువైట్‌లోని మొత్తం విదేశీయుల్లో భారతీయుల సంఖ్య 14.5 లక్షలు.
 
కువైట్‌లో స్థానిక జనాభా కంటే విదేశీయుల జనాభా మూడు రెట్లకుపైగా ఉన్నది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లు ఎదురుకాకుండా ఉండేందుకు మొత్తం జనాభాలో విదేశీయుల జనాభాను 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గించాలని ఆ దేశ ప్రధాని షేక్ సబా అల్-ఖలీద్ అల్-సబా ఇటీవల నిర్ణయించారు. 
 
దీంతో కువైట్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్)కి చెందిన చట్టసభ్యుల కమిటీ ఇటీవల విదేశీయుల జనాభా తగ్గింపునకు సంబంధించిన ముసాయిదా బిల్లును రూపొందించింది. ఈ బిల్లు ప్రకారం కువైట్‌లో భారతీయుల జనాభాను 15 శాతానికి పరిమితం చేశారు. ఈ బిల్లును ఆ దేశ జాతీయ అసెంబ్లీ ఆమోదిస్తే సుమారు 8 లక్షల మంది భారతీయులు కువైట్‌ను వీడాల్సి ఉంటుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: ఫేషియల్ ట్రీట్మెంట్ చేసుకున్న రష్మిక మందన్న

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments