Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య డబ్బుతో ప్రియురాళ్ళతో భర్త ఎంజాయ్.. పడక గదిలో ఇద్దరమ్మాయిలతో...

కష్టసుఖాల్లో పాలు పంచుకోవాల్సిన భర్త.. తన భార్య సంపాదనతో ఇద్దరమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. కువైట్‌లో జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే...

Webdunia
శనివారం, 1 జులై 2017 (08:58 IST)
కష్టసుఖాల్లో పాలు పంచుకోవాల్సిన భర్త.. తన భార్య సంపాదనతో ఇద్దరమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. కువైట్‌లో జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
కువైట్‌ నగరంలో ఇద్దరు భార్యాభర్తలు నివశిస్తున్నారు. అయితే, పెళ్లికి ముందు నుంచే ఆ వ్యక్తికి ఇద్దరు ప్రియురాళ్లు ఉన్నారు. వారితో ఎంజాయ్ చేసేందుకు ఓ వినూత్నంగా ఆలోచన చేశాడు. ఖైరాన్ ఏరియాలో సొంతగా ఓ ఫ్లాట్ కొందామని భార్యను నమ్మించాడు. దీంతో భార్య 20 వేల కువైట్ దీనార్లు (సుమారు 45 లక్షల రూపాయలు) ఇచ్చింది. 
 
ఈ డబ్బుతో న్యూగ్రా ప్రాంతంలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని తన ప్రియురాళ్లతో రాసలీలలు కొనసాగిస్తూ వచ్చాడు. ఎన్ని సార్లు అడిగినా కొత్త ఫ్లాట్ వద్దకు తీసుకెళ్లకపోవడం, రిపేర్లు చేయిస్తున్నానంటూ చెపుతూ తప్పించుకోసాగాడు. దీంతో భర్త తీరుపై భార్యకు అనుమానం వచ్చింది.
 
ఓ రోజు చెప్పాపెట్టకుండా అనుమానం రాకుండా భర్తను భార్య అనుసరించింది. ఖైరాన్ ప్రాంతం అని చెప్పి న్యూగ్రాకు వెళ్తుండటంతో ఆ అనుమానం మరింత బలపడింది. ఊరిచివరన ఉన్న ఓ ఎస్టేట్‌లో ఫ్లాట్ ముందు భర్త కారు ఆపి లోపలికి వెళ్లడాన్ని చూసింది. కొద్దిసేపటి తర్వాత ఆ ఫ్లాట్ వద్దకు వెళ్లి కాలింగ్ బెల్ కొట్టగా, ఓ యువతి వచ్చి డోర్ ఓపెన్ చేసింది. అంతేలోపలికి దూసుకెళ్లి బెడ్‌రూమ్‌లో ఉన్న భర్తను చూసి అసలేం జరుగుతుందో గ్రహించింది. ఇద్దర్నీ అక్కడే ఉంచి తలుపు తాళం వేసి పోలీసులకు ఫోన్ చేసింది. మొత్తం విషయాన్ని పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పి భర్తపై కేసు నమోదుచేసింది. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments